పేదల భూమిలో, ఒక అద్భుతం!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Social Economic Zone…
నాలుగు ఇడ్లీలు ప్లేట్‌లో వేసి ,లోటాతో సాంబార్ ఇచ్చాడు సప్లయర్. ఇడ్లీ తింటున్నామో,సాంబారు జుర్రు కుంటున్నామో తెలీకుండా లంచ్ కానిచ్చి బయట పడ్డాం. చెన్నయ్ నుండి, అయిదో నెంబర్ జాతీయ రహదారిలో మా ప్రయాణం.
తొలకరి మొదలైన కాలం. పైన మబ్బులు అపుడపుడు చిరు జల్లులు…
‘ ఇంకో యాభైకిలోమీటర్లు వెళ్తే తడ వస్తుంది…’ అన్నాడు డ్రైవర్.
సాయంత్రానికి మాంబట్టు దగ్గరలోకి వచ్చాము.వాహనం పక్కన ఆపి, టీ తాగుతున్నాం..
ఒక్క సారిగా వందలాది బైక్లు రోడ్లమీదకు వచ్చి ,జోరుగా సందడిగా దూసుకు పోతున్నాయి…
‘‘ దేనికీ .. బైక్ ర్యాలీ..?’’ టీ స్టాల్‌లో ఉన్న వారిని అడిగాం.
‘ ఇక్కడ రోజూ బైక్ ర్యాలీనే… దగ్గరలో అపాచీ కంపెనీ ఉంది. వీరంతా అక్కడ పనిచేసే ఉద్యోగులు ’ అన్నారు వారు.
బైక్ లు వెళ్లాక షేర్ ఆటో ర్యాలీ మొదలైంది. ఆడపిల్లలు ఆహ్లాదంగా కబుర్లు చెప్పుకుంటూ ఇళ్లకు బయ దేరారు. వారు కూడా అపాచీలో ఉపాధి పొందుతున్న వారే…
……………..
ఇదే ప్రాంతంలో ఇరవై గ్రామాల్లో 700 ఎకరాల్లో సెజ్ కోసం భూ సేకరణ చేస్తున్న రోజులు అవి (2009).
నిత్యం అక్కడ ఎర్రజెండాలు ఎగురుతూ నిరసనలు జరుగుతున్నాయి.
ఆ గ్రామాల్లో తిరిగి,రైతులతో మాట్లాడి కేస్ స్టడీ చేయమని ఒక సంస్ధ మాకు ఎసైన్మెంట్ ఇవ్వడంతో అటు వైపు వచ్చాం.
…………
సత్యవేడు సమీపంలో ముత్తేరుమిట్ట, తొండూరు గ్రామాలు తిరుగుతూ, ఎర్ర మట్టి దారిలో చిగురు పాళెం వెళ్లాం. ఒక పూరింట్లో భార్యా,కూతురుతో బతుకుతున్న శ్రీనివాసుల ను కలిశాం.’’ మా తాతల నాటి నుండి ఐదున్నర ఎకరాలు నమ్ముకునే బతికాం. వర్షాధార వ్యవసాయం. నానా తంటాలు పడి సాగుచేస్తే ఏడాదికి 30 వేలు కూడా మిగలడం లేదు. చుట్టూ అప్పు , కూతురిని పై చదువు చదివిద్దామంటే చిల్లిగవ్వలేదు. ఇలాంటి దరిద్రంలో, ఇక్కడ కంపెనీు వస్తున్నాయంటే, సర్కారుకి నా భూమిని ఇచ్చాను.17 లక్షలు పరిహారం వచ్చింది.’’ అని చెప్పాడు. మేం కలిసిన పదిమంది రైతుల్లో ఏడుగురు పరిశ్రమ లను సపోర్ట్ చేశారు. దానికి కారణం వారి భూములు సాగుకు అనువుగా లేక పోవడమే…

మనిషికి భూమికి ఉన్న అనుబంధం గొప్పదే, కానీ, ప్రకృతి సహకరించనపుడు, వ్యవసాయం భారమైనపుడు, ఈ రైతులు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని,తమ భవిష్యత్‌ని తీర్చిదిద్దుకున్నారు.
వారు ఇచ్చిన బీడు భూములే, నేడు 40వేల మందికి బతుకు తెరువుగా మారాయి.
శ్రీసిటీ పారిశ్రామిక పార్క్ ఏర్పడి 120 పరిశ్రమలతో పాటు, ఆసుపత్రులు ,విద్యాలయాలు వచ్చాయి. చివరికి మన దేశాన్ని రక్షించే రఫేల్ యుద్ధ విమానాలకు నీడను కూడా ఆ పేదల భూములే ఇస్తాయని,వారు కూడా ఊహించి ఉండరు.
ఒకపుడు రాయసీమలో రతనాలు రాసు లు పోసి అమ్మేవారు. ఆ తరువాత రాళ్ల సీమగా మారింది. ఆ రాళ్లసీమలో ఇపుడు రాఫెల్ విమానాలు కొలువు తీరాయి.

Share.

Leave A Reply