వీరి ‘గీత’ మారాలి?

Google+ Pinterest LinkedIn Tumblr +

వీరి ‘గీత’ మారాలి?
ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది.కానీ వారు రోజూ కడుపు నిండా అన్నం తినాలంటే బతకడానికి మార్గం చూపాలి. ఏకలవ్య ఫౌండేషన్‌ ఇలాగే అలోచించి, చదువుకు దూరమవుతున్న మురికివాడల చిన్నారుల్లో ప్రతిభకు పదును పెట్టడానికి ‘అక్షయ విద్య ‘ను అందిస్తోంది. మొదలు పెట్టింది. హైదరాబాద్‌,దిల్‌షుక్‌ నగర్‌ లోని శాలివాహన నగర్‌ మురికివాడలో అయిదుగురు చిన్నారులతో 2013లో మొదలైన అక్షయ విద్య, నేడు నగరంలో 56 కేంద్రాల్లో, 1560 పేద పిల్లలకు చేరువైంది. ఇటీవల బోరబండ స్లమ్‌లో రూరల్‌మీడియా ఎడిటర్‌ శ్యాంమోహన్‌ పేద చిన్నారుల మధ్య గడిపారు.వారు చదువుతున్న పాఠశాలల్లో డ్రాయింగ్‌ టీచర్లు లేరని,ఆర్ట్‌ నేర్చుకోవాలని ఉందని వారంతా ఆశగా చెప్పారు. ఈ సందర్బంగా ఆయనిలా అంటారు
” మాకు డ్రాయింగ్‌ అంటే ఇష్టం కానీ స్కూల్లో నేర్పడం లేదంకుల్‌ ” బోరబండ స్లమ్‌లో నా చుట్టూ చేరిన చిన్నారులందరి మాట ఇది.
లెక్కలు,ఇంగ్లిషు మీద దృష్టిపెట్టాలంటే ముందు మానసిక వికాసం ఉండాలి. నచ్చిన కళల్లో వీరిని తీర్చిదిద్దితే, కష్టమైన సబ్జెక్టులు ఇష్టంగా చదువుతారు..
అమ్మానాన్నలు కూలీకి పోతే ఈ బిడ్డలు రోడ్లమీద తిరిగే వారు. అలాంటి వారిని చేరదీసి’అక్షయవిద్య’ను అందిస్తున్నారు ముగ్గురమ్మాయిలు.
రెండు గంటలు వీరి మధ్య గడిపాను. నేను కార్టూన్లు నేర్పితే, వారు నాకు జీవిత పాఠాలు నేర్పారు.”

Share.

Leave A Reply