ఉచితంగా శిక్షణ, ఉద్యోగానికి భరోసా !!

Google+ Pinterest LinkedIn Tumblr +

చదువుకి తగిన ఉపాధి లేక, నిరాశతో, తలొంచుకొని, సెల్‌ఫోన్లలో కాలక్షేపం చేస్తున్న యువతను తలెత్తుకు బతికేలా తీర్చుదిద్దుతున్న నిర్మాణ్‌, ప్రథమ్‌,జిఎమ్మార్‌ సంస్ధలతో కలిసి జర్నీచేశాం. ఫిఫ్త్‌క్లాసు నుండి డిగ్రీవరకు, ఎవరి చదువుకు తగిన నైపుణ్యం వారికి నేర్పి, ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
ఇదేమీ, నిరుద్యోగుల అవసరాన్ని క్యాష్‌ చేసుకునే బిజినెస్‌ కార్యక్రమం కాదు. యువతకు ఉపాధి చూపాలనే తపనతో కొన్ని స్వచ్ఛంద సంస్ధలు, కార్పొరేట్‌ కంపెనీల తోడ్పాటుతో,
ఉచిత హాస్టల్‌ వసతి కల్పించడంతోపాటు, నిపుణులతో శిక్షణ ఇస్తారు. అదే సమయంలో యోగా, వ్యక్తిత్వ వికాసం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ వంటి అంశాల్లో కూడా అవగాహన కల్పిస్తారు.
ఈ కేంద్రాలు అమీర్‌ పేట్‌,శంషాబాద్‌, బండ్లగూడ (హైదరాబాద్‌) సిసిడి,వర్ని(నిజామాబాద్‌) లో నిర్వహిస్తున్నారు.
1, నిర్మాణ్‌ లో నిరుద్యోగులకు నైపుణ్యం…
టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌, బిట్స్‌పిలానీ పూర్వ విద్యార్థులు ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్‌ తో కలిసి బీటెక్‌ లేదా కంప్యూటర్‌ అవగాహన ఉన్న ఏదైనా డిగ్రీ ప్యాసైన వారికి డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ డెవలప్‌ మెంట్‌, సిఎస్‌ఎస్‌, హెచ్‌టిఎంఎల్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు.
గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. ఆసక్తిగల అభ్యర్థులు అమీర్‌పేట, ఆదిత్య ఎంక్లేవ్‌ లోని నిర్మాణ్‌, టెక్‌ మహేంద్ర ఫౌండేషన్‌ శిక్షణ కేంద్రాన్ని సంప్రదించండి. వివరాలకు 7675914735, 9515134735 కాల్‌ చేయండి.

2, సిసిడి,వర్నిలో ప్రథమ్‌ శిక్షణ!!
దేశవ్యాప్తంగా విద్య,ఉపాధి కోసం కృషి చేస్తున్న ప్రథమ్‌ సంస్ధ నిజామాబాద్‌లోని సిసిడి,వర్ని తో కలిసి గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే దిశగా పనిచేస్తున్నారు.
8వతరగతి నుండి ఇంటర్‌ మీడియట్‌ వరకు ఎవరికి అవసరమైన వత్తి విద్యలో వారికి శిక్షణ ఉంది. 18నుండి 30సంవత్సరాల వయసు గల యువతీ యువకులు అర్హులు. అభ్యర్దులకు శిక్షణతో పాటు, వసతి,భోజన సదుపాయం కల్పించి, ఉద్యోగాలు పొందడానికి వీలుగా సాఫ్ట్‌ స్కిల్స్‌లో కూడా శిక్షణ ఇస్తారు.
వసతితో పాటు, యూనిఫామ్‌, కోర్సుకు సంబంధించి పుస్తకాలు,పరికరాలు ఇస్తారు. మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవాలి. తర్వాత సంస్థ ప్రతినిధులే వీరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటారు. ఉద్యోగులు కావాల్సిన సంస్థల జాబితా నిర్వాహకుల దగ్గర ఉంటుంది. వీరు ఆయా జాబితాలోని సంస్థలను సంప్రదించి తమ వద్ద శిక్షణ పొందిన వారి వివరాలు ఇచ్చి ఉద్యోగం ఇప్పించేందుకు సహకరిస్తారు.
ఈ కోర్సులలో, శిక్షణ
హోటల్‌ మేనేజ్‌ మెంట్‌, హెల్త్‌కేర్‌.బ్యూటీషియన్‌,ఆటోమేటివ్‌, ఎలక్ట్రీషియన్‌. వీటికి అదనంగా స్పోకెన్‌ ఇంగ్లీషు, కంప్యూటర్‌ శిక్షణ ఉంటుంది. విద్యార్హత, ఆధార్‌, వయస్సు
ధవీకరణ,రేషన్‌ కార్డు, ఫొటోలు , 5కాపీలు చొప్పున అందచేయాలి.
శిక్షణ ఎక్కడ?
నిజామాబాద్‌ జిల్లా, సిసిడి వర్నిలో ప్రశాంతమైన వాతావరణంలో, విశాలమైన ప్రాంగణంలో శిక్షణా కార్యక్రమం ఉంటుంది. శ్రీకాంత్‌ (6303466344, 8985330633) కి కాల్‌ చేయవచ్చు.

3, జిఎమ్మార్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌
‘జిఎమ్‌ఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌’ (జిఎంఆర్‌విఎఫ్‌). ప్రసిద్ధ ‘జిఎంఆర్‌’ గ్రూపులో కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీకి చెందిన విభాగమిది.
పన్నెండేళ్ల క్రితం ప్రారంభమైన జిఎంఆర్‌విఎఫ్‌, దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధికల్పనలో అట్టడుగు వర్గాలకు అండగా నిలిచింది. దశాబ్ద కాలంగా సుమారు 7,500 మంది యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. అలా శిక్షణ పొందిన వారిలో కొందరు స్వయంగా ఉపాధి కల్పించుకుంటున్నారు. మరికొందరు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు.
శిక్షణ ఇచ్చే కోర్సులు ఇవే…
1,డ్రైవాల్‌,ఫాల్స్‌ సీలింగ్‌,2,ఎక్సవేటర్‌ ఆపరేటర్‌,3, వెల్డింగ్‌ టెక్నీషియన్‌,4,రిఫ్రిజిరేషన్‌,ఎయిర్‌ కండీషనింగ్‌,5,ఆటోమొబైల్‌ ,టూవీలర్‌ రిపేరింగ్‌, 6,ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌, 7, సోలార్‌ టెక్నీషియన్‌.8కారు డ్రైవింగ్‌,9,కంప్యూటర్‌ యంఎస్‌ ఆపీస్‌, 10 టైలరింగ్‌ (మహిళలకు మాత్రమే) ఆటోమొబైల్‌, ద్విచక్రవాహనాల రిపేరింగ్‌, ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌ వంటి కోర్సులకు కనీసం ఎనిమిదో తరగతి చదివి 18సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకులు అర్హులు.
వీరికి ఉచిత హాస్టల్‌ వసతి కల్పించండంతోపాటు మూడు నెలల పాటు నిపుణులతో శిక్షణ కల్పిస్తారు. శిక్షణ కాలంలో యోగా, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, కరాటే, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ విద్య వంటి అంశాల్లో నిపుణులచే మెలకువలు నేర్పిస్తారు.
విద్యార్హత, ఆధార్‌, వయస్సు ధవీకరణ,రేషన్‌ కార్డు, ఫొటోలు, 5కాపీలు చొప్పున అందచేయాలి.
శిక్షణ ఎక్కడ?
శంషాబాద్‌ సమీపంలో జియంఆర్‌ వరలక్ష్మి సెంటర్‌ ఫర్‌ ఎంపవర్‌ మెంట్‌, లైవ్‌లీహుడ్స్‌, ఎయిర్‌ పోర్ట్‌ క్యాంపస్‌,చిన్మయి స్కూల్‌ దగ్గర, మామిడిపల్లి రోడ్‌,శంషాబాద్‌.
ఇలా వెళ్లండి
శంషాబాద్‌ ఆర్టీసీ బస్‌స్టాండ్‌ ఎదురుగా మామిడిపల్లి గ్రామానికి వెళ్లే ఆటోలు ఎక్కి జీఎంఆర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కి అంటే, తీసుకెళ్తారు. మరిన్ని వివరాలకు 9494800102, 8919890976, 9985574742 కి కాల్‌ చేయవచ్చు.
……………………….

Share.

Leave A Reply