బేబీ పాటకు, బాలు ఫిదా…

Google+ Pinterest LinkedIn Tumblr +

గాన గంధర్వులను పరవశింపజేసిన పల్లె కోయిల..!

ఆమె ఓ పల్లెటూరుకు చెందిన సాధారణ గృహిణి.. పేరు బేబీఊరు తూర్పుగోదావరి జిల్లా వడిశలేరువ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే కుటుంబంఅక్షరమైనా చదవలేని నిరక్షరాశిఓ మనవరాలిని కూడా ఎత్తుకున్న ఆమెకు పాటలు పాడటం ఆమె ఇష్టమైన వ్యాపకంటీవీల్లోరేడియోల్లో వచ్చిన పాటలను గుర్తుపెట్టుకుని యథాతథంగా పాడటం ఆమె మనసుకు నచ్చే ప్రక్రియ.

పనితో పాటే పాటనూ ప్రేమించిందినలుగురికి తన గానామృతం పంచుతూ వచ్చిందిగంజి కోసం పక్క ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఆమె పాటను ప్రేమించే ఓ అమ్మాయి.. బేబీ పాటను ఆమెకు తెలియకుండానే రికార్డు చేసిందిఓ చెలియా నా ప్రియసఖియా..అంటూ బేబీ ఆలపించిన ఆ పాట ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టి.. ఫేస్‌ బుక్‌కు ఎక్కిన ఆమె పాట ప్రపంచానికి పరిచయమైందిఏళ్ల తరబడి సాధన చేసిన వారు కూడా పాడలేనంత అలవోకగా.. శ్రుతిలయలు తప్పకుండా ఆమె పాడుతున్న తీరు సంగీత ప్రియులను మైమరపింప చేసిందిఅంతే.. సోషల్ మీడియాలో ఆమె ఓ సంచలనంగా మారిందిక్రమంగా టీవీ ఛానళ్లు ఆమెతో పాటలు పాడించుకోవడం.. సినీ ప్రముఖులు మెచ్చుకోవడం.. సినిమా అవకాశాలు ఇవ్వడం ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి.

ఇప్పుడామె ఓ ప్రముఖ గాయనిగా మారిందిసంగీత దర్శకులు రఘు కుంచెకోటి వంటి వారు ఆమెకు సినిమా పాటల అవకాశాలు ఇచ్చారురఘు కుంచె సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన ” మట్టి మనిషినండీ నేను..మాణిక్యమంటారు నన్ను..” పాట.. ఆమె పరిచయ గీతంగా మారింది.

Singer Baby got SP Balasubrahmanyam Praise

తాజాగా సింగర్ బేబీని గాన గంధర్వుడుగా పిలుచుకునే బాల సుబ్రహ్మణ్యం ప్రశంసించారుఆమెను తన పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కు అతిథిగా ఆహ్వానించి ఆమెతో పాట పాడించారుఆ కార్యక్రమంలో తూనీగా తూనీగా పాటను ఆలపించి బేబీ అందరి ప్రశంసలు అందుకున్నారుఆమె పాట పూర్తికాగానే బాలు లేచి చప్పట్లతో ఆమెను అభినందించారుపాడుతా తీయగా కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు కూడా బేబీ పాట పూర్తికాగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టారుఆ సందర్భంగా సింగర్ బేబీపై బాలు ప్రశంసల వర్షం కురిపించారు.

ఒక పాట వీడియోకు కొన్ని లక్షల లైకులువ్యూలు రావడం సంగీత స్రష్టలకే కష్ట సాధ్యంగా ఉంటుందని అలాంటిది బేబీ పాటకు లక్షల్లో లైకులు రావడం చెప్పుకోదగిన గుర్తింపుగా వర్ణించారుసోషల్ మీడియా వల్ల జరుగుతున్న మంచిలో ఇదొకటిగా బాలు అభిప్రాయపడ్డారుఒక పల్లెటూరి రైతుకూలీ ఇంత శ్రుతిపరంగా పాడటం చాలా అరుదని మెచ్చుకున్నారుఇంత మంచి మట్టిలో మాణిక్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మాయి కాళ్లకు సంగీత ప్రపంచమంతా దండం పెట్టుకోవాలని ఎస్పీ బాలు అన్నారు.

బేబీ కుటుంబంలో ఎవరో ఒకరు సంగీతానికి సంబంధించి ఉండి ఉంటారని లేకపోతే ఇంత సంగీత సంస్కారం అసాధ్యమని బాలు అభిప్రాయపడ్డారుతనను పిలిచి గౌరవించి పాడుతాతీయగాపై పాట పాడే అవకాశం ఇచ్చిన బాలు గారికి బేబీ కృతజ్ఞతలు తెలిపిందితనకు బాగా ఇష్టమైన గాయకుడు బాలుసుబ్రహ్మణ్యం గారని.. ఆయన పాటలు పాడుకుంటూ పెరిగానని బేబీ చెప్పారుబాలు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారునిజమైన పల్లె మాణిక్యం బేబీ మరిన్ని సంగీత విజయాలు అందుకోవాలని రూరల్ మీడియా ఆశిస్తోందిమరిన్ని పల్లె తేజాలు ప్రపంచానికి పరిచయమవ్వాలని రూరల్ మీడియా ఆకాంక్షిస్తోంది.

  • అక్షర ప్రణవ్
Share.

Leave A Reply