శ్రీసిటీలో “సిమ్స్” హాస్పిటల్

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీసిటీలో “సిమ్స్” హాస్పిటల్ 

– కలెక్టర్, ఎస్పీ సమక్షంలో అవగాహనా ఒప్పందం 
 
 శ్రీసిటీ,జనవరి 5 : చెన్నైకు చెందిన ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (సిమ్స్) సంస్థ చెందిన ప్రత్యేక మెడికల్ కేర్ సెంటర్ శ్రీసిటీలో ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి గురువారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర బాబు సమక్షంలో శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, సిమ్స్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ రాజు శివస్వామి లాంఛనంగా అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో  విషజ్వరాల బారిన పడి ఎక్కువమంది చనిపోతున్నందున, డెంగు వంటి వ్యాధులకు సంబందించిన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని సిమ్స్ అధికారులను కోరారు. 

ఈ సందర్భంగా రాజు శివస్వామి మాట్లాడుతూ, భారీ పరిశ్రమలకు నెలవైన శ్రీసిటీలో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుందన్నారు. మెడికల్ సెంటర్ ద్వారా అన్ని రకాల ప్రాథమిక వైద్యసేవలుతో పాటు ఎమర్జెన్సీ కేర్, ట్రామా కేర్ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో వుంటారని పేర్కొన్నారు. 

కలెక్టర్ సమక్షంలో అవగాహనా ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న శ్రీసిటీ ఎండీ, సిమ్స్ వైస్ ప్రెసిడెంట్

కలెక్టర్ సమక్షంలో అవగాహనా ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న శ్రీసిటీ ఎండీ, సిమ్స్ వైస్ ప్రెసిడెంట్

శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ,  మౌళిక వసతులు, సౌకర్యాలు, సామాజిక సదుపాయాలూ ఇతర అన్ని అంశాలకు సంబంధించి శ్రీసిటీలో ప్రపంచశ్ రేణి వసతుల కల్పించదానికి తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే చెన్నైలోని ప్రముఖ సిమ్స్ హాస్పిటల్ సేవా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీసిటీతో పాటు చుట్టుప్రక్కల  గ్రామస్థులు కూడా   ఈ హాస్పిటల్ ద్వారా మెరుగైన  వైద్యసేవలు పొందగలుగుతారన్నారు. 
ఇప్పటివరకు శ్రీసిటీలో ఆరు సంవత్సరాలుగా ఫ్రాంటియర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ వారు మెడికల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి సిమ్స్ సంస్థ శ్రీసిటీ మెడికల్ సెంటర్ ను నిర్వహించనుంది. 
Share.

Leave A Reply