కొమ్మ మీద యవ్వనం

Google+ Pinterest LinkedIn Tumblr +

కొమ్మ మీద యవ్వనం గువ్వలా రెక్కులు విచ్చుకుంటున్నరోజులు..
పట్టుమని 16 ఏళ్లు కూడా లేవు నాకు.ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అనుకుంటా..
‘‘Walter de la Mare was a poet, story writer. He was born …’’ ఇంగ్లీష్ లెక్చరర్ క్లాసు తీసుకుంటోంది…
లాస్ట్ బెంచీలో కూర్చున్న నేను క్లాసు పుస్తకాల మధ్య దాచుకున్న నవలను బయటకు తీశా…
‘‘ అక్కడికి వెళ్ళిన మొదటి నిమిషానే అర్ధమయింది నాకు, ఆ స్థలంలో అద్వితీయనందాన్ని అనుభవించబోతున్నానని. చుట్టూ ఉన్న ఆకాశాన్ని, కొండల్ని, పక్కన చింత చెట్లనీ మా చిన్న ఇల్లునీ, ఆ గాలినీ, అమీర్నీ చూడగానే నా మనసెట్లా అయిందనుకున్నావు చెప్పనా? ’’ అంటూ ఊరించింది రాజేశ్వరి.
……………….
అదే రోజు మధ్యాహ్నం హిస్టరీ క్లాసు జరుగుతోంది…
మళ్లీ అదే నవలలో మిగిలిన కథ…
మైదానం దాటి వెళ్లి, యేట్లో స్నానం చేస్తున్నారు. రాజేశ్వరి, అమీర్…వారితో పాటు నేను కూడా మునకలు వేయబోతుంటే…
లెక్చరర్ విసిరిన నోట్ బుక్ వచ్చి ఫట్ మని చెంపకు తగిలింది.
నా చేతిలోని ‘‘ మైదానం ’’నవలను ఆయన కిటికీ నుండి బయటకు విసిరి కొట్టాడు.
………….
అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నవల వైపు చూడాలంటే భయం. ఆ వయస్సులో అది పూర్తిగా చదివితే యేట్లో పడి ఎటు కొట్టుకు పోయే వాడినో….!!

Share.

Leave A Reply