శతాబ్దాలెగిరిపోతున్నాయి చూద్దాం పదండి..

Google+ Pinterest LinkedIn Tumblr +

నేను ఝంఝామారుతాన్ని – నేను వచ్చాను. అశాంతిని పంచి పెట్టడానికి, అరుస్తున్నాను ఆర్తిని తరిమేద్దామని; రండి నాతో, నా ప్రజలారా! రండి నాతో, నా ప్రజలారా! రండి… నాతో రావాలంటే సొంతం కోల్పోవాలి’ నీ కంఠంలోనించి నీ సొంత పాట పీకెయ్యాలి. అడుగడుగునా ప్రజల పాటల పిడుగులు కురిపించాలి ఆకాశం ఉరిమినట్లు… నీ యుద్ధాగ్నులు నీ దేశపు యుద్ధాగ్నుల్లో కలపాలి, నీ పిడెకెడుబ్రతుక్కి ఎంత ప్రేమ కావాలి?

పీడితప్రజలకే ఈ భూమి సంక్రమిస్తుంది! రండి, పాతిపెట్టిన ఉషస్సును బయటకి తీద్దాం, ఉషస్సు ఉషస్సు అంటూ పరుగిడుదాం పదండి రండి నా ప్రజలారా! మీ నాగళ్ళు భుజాన వేసుకురండి, మీ భార్యల్ని మీ పిల్లల్నీ అందర్నీ తీసుకురండి. ఇళ్ళలోనించి వాకిళ్ళలోనించి స్కూళ్ళలోనించి ఆఫీసులనించి అసెంబ్లీలనించి అకాడమీలనించి రండి – కాలపు గాలి దుమారంలో శతాబ్దాలెగిరిపోతున్నాయి చూద్దాం పదండి..

My Country-My People(Modern Indian Epic),Na Desham-Na Prajalu(Adhunika Itihasam) is Seshendra Sharma’s Magnum Opus. This has placed modern Indian poetry on the world map of literature. This was nominated for Nobel Prize in 2004. This Long poem has been translated into several Indian and western languages.

for books, pls contact, SATYAKI-9441070985

My Country-My People, poetry , SeshendraSharma.

Link :   http://kinige.com/author/Gunturu+Seshendra+Sharma

..

Share.

Comments are closed.