ఆంధ్రజ్యోతిలో అరుదైన అద్భుతం !!

Google+ Pinterest LinkedIn Tumblr +

‘1930 దాకా తెలుగు కవిత్వం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచి నేను దాన్ని నడిపిస్తున్నాను. దిస్‌ సెంచరీ ఈజ్‌ మైన్‌’, అని ప్రకటించాడు శ్రీశ్రీ అప్పట్లో…
ఇపుడు కరోనా తరువాత కవిత్వాన్ని ఆదేశ్‌ రవి నడిపిస్తున్నాడు. పత్రికా సంపాదకీయాల చరిత్రలో ఈ రోజు ఆంధ్రజ్యోతిలో అరుదైన అద్భుతం జరిగింది. ఆదేశ్‌ రవి పాటే…సంపాదకీయంగా మారింది!!

జమ్మికుంటలో పెరిగిన తంగేడు పువ్వులాంటోడు…
ప్రాసలు, యతులు, పదబంధాలు తెలియని,అతి సామాన్య రచయిత.
కానీ, రహదారుల మీది అంతులేని వేదనను అక్షరాలు గా మార్చాడు.
‘‘ దేశమేమో పెద్దదా, మా బతుకులేమో చిన్నవాయె
మాయదారి రోగమొచ్చి మా బతుకుమీద మన్నుబోసె….
ఏమి బతుకు?
ఏమి బతుకు?
ఏమి బతుకూ…? ….’’ అంటూ, వేధన,కన్నీళ్లు కలిపిన ఆదేశ్ రవి స్వరాన్ని వినండి.
మళ్లీ మళ్లీ వినండి..
మనలోని మానవత్వం మేలుకొంటుంది !!

Song-https://youtu.be/slSy2NGA5RU

andhrajyothi-
https://epaper.andhrajyothy.com/c/51436723…

Share.

Leave A Reply