ఆస్కార్ కు ఏమాత్రం తగ్గని సినిమా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇది రివ్యూ రాయడం కాదు . ఓ సినిమా చూసిన తరువాత “ ఓ మంచి సినిమా చూసాము “ అని అనుకోవడం వేరు . ఆ అభిప్రాయాన్ని oral గా కొంత మందితో share చేసుకోవడం వేరు. దాన్నే రాయాలి అనిపించడం వేరు . ఒక్కొక్కరి perspective లో కారణాలు అనేకం . ఈ మధ్య కాలంలో అలా అనిపించి రాయాలి అనుకున్న సినిమాల్లో తమిళ్ సినిమా “ Super Deluxe “ . మూడు వారాల క్రితం రిలీజ్ అయింది . అది ఆస్కార్ సినిమాలకు పోటీ పడే ఏ సినిమాలకు తక్కువగాని సినిమా . ఇంకోటి ఇవాళే రిలీజ్ ఐన తెలుగు సినిమా జెర్సీ .కొన్ని సినిమాల్లో content లక్ష్యం బాగుంటుంది . కానీ చివరిదాక అంతే గ్రిప్ తో దాన్ని కంటిన్యూ చేయలేరు . రకరకాల calculations తో, కథ ను మార్చుకుంటూ , దాని organic evaluation ను పాడు చేసుకుని , ఎక్కడెక్కడో తిప్పి , బలవంతపు అతుకులతో తయారయ్యే సినిమాలు వుంటాయి . అనేక కారణాలతో అవి ఆడితే ఆడొచ్చు. కానీ లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి . ఇంకొన్ని సినిమాల్లో content కొత్తగా వుంటుంది . New wave సినిమాల్లాగా వుంటాయి . కానీ కథను perfect గా present చేయలేకపోవడంతో ఫీల్ అంతగా వర్కవుట్ అవ్వలేదని తెలిసిపోతుంది . కానీ , compramised status తో ఆడుతుంటాయి .కానీ, ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ రెండు సినిమాలు మాత్రం వేరు అని అనిపిస్తుంది . రెండు సినిమాలకు స్పష్టమైన తేడా కూడా వుంది .Super Deluxe సినిమాలో, తాత్వికతతో కూడిన ఓ deep content ను సరదా characters తో , కథను సరదాగా చెబుతున్నట్లే చెబుతుంటాడు. కానీ ఎవరు ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో టచ్ చేయని విలువైన కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు . Logic లేని ఆంక్షలతో , సామాజిక నిషేదాలతో , ఆధిపత్యంతో, హిపోక్రసితో , trained and organised perspective తో , selfish expectations తో తరతరాలుగా సమాజంలోని మనుష్యులు తోటి మనష్యుల పట్ల ఎలా మానసిక హింసకు పాల్పడుతున్నారో , లేదా తమకు తెలిసో , తెలియకుండానే ఇంకొకరి జీవితాన్ని అన్యాయంగా ఎలా శాసిస్తున్నారో అనే కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు ఈ సినిమా ద్వారా .ఎలా అయితే story and screenplay కొత్తగా వుంటుందో , అలానే Cinematography , Art Direction, Background Music ఇలా మొత్తం 24 క్రాఫ్ట్స్ అనుకున్న కథను present చేయడానికి beautiful గా ఉపయోగపడ్డాయి . ఇలాంటి బరువైన, లోతైన, ప్రయోగాత్మక సినిమాలను attempt చేయడమే కష్టం . అట్లాంటిది మెప్పించే విధంగా , విజయవంతంగా ఆవిష్కరించడం అత్యంత అరుదు . That is why it’s a very rare movie to watch and enjoy. ఆస్కార్ కు పోటీ పడే సినిమాలకు ఏమాత్రం తక్కువ గాని సినిమా . World Cinema .
( Though It has some issues with end part ) ఇంకోటి ఇవాళే రిలీజ్ అయిన మన తెలుగు సినిమా జెర్సీ . ఎందుకు దీని గురించి రాయాలి ? 
ఈ సినిమాలో content మరీ కొత్తది కాదు . ఏదో కొత్త విషయం చెబుతున్నానన్న బిల్డప్ వుండదు . కథలో అనవసర అతికింపులూ వుండవు . సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే , ఇది ఓ క్రికెటర్ కథ . 1986, 1996 , 2019 కాలంలో జరిగే కథ . క్రికెటే జీవితంగా , ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఓ రంజీ క్రికెటర్ కథ . ఆయనది ఓ రకంగా ఎవరూ లేని Orphan Life . కేవలం కోచ్ మాత్రమె అండగా ఉంటాడు . ప్రేమించినామె భార్యగా వస్తుంది . అప్పటినుండి ఎందుకో గానీ క్రికెట్ మానేస్తాడు . ఇంట్లో జులాయిగా ఉంటాడు. చిల్లర ఖర్చులకు అప్పులు చేస్తుంటాడు . wife సంపాదనతో ఇల్లు గడుస్తుంది . wife సరిగ్గా మాట్లడదు . ఇతని మీద రుసరుసలాడుతుంది . ఎనిమిది ఏళ్ల కొడుకు . ఈ పిల్లాడికీ క్రికెటర్ అవ్వాలనే కోరిక . ఇలాంటి కథా నేపథ్యంలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ? అతని జీవితం ఫెయిల్యూరా ? సక్సెస్ ఫులా ? అనేది కథ .వినడానికి నార్మల్ గానే వుంది ఎందుకు ఏంటి దీని ప్రత్యేకతా ?
నిజమే లోతైన కథ కాకపోవచ్చు . కానీ ఏ ఆర్భాటాలకు , హంగామాలకు పోకుండా , కథకు కృత్రిమత్వాన్ని జోడించకుండా కథను సహజంగా నడిపించడమే దీని ప్రత్యేకతా . బహుశా కృత్రిమ కథలతో కూడిన మన సినిమాల దాడి నుండి బయటపడుతున్న వెలుగు కొంత కావచ్చు .కేవలం కథ , screenplay మాత్రమె బాగుంటే సరిపోదు . Technically also its a very good film . Wwonderful craft . Periodic story కాబట్టి దానికి తగిన Cinematography & ఆర్ట్ డైరెక్షన్ . Crispy & Back and forth editing. షాట్స్ మేకింగ్ ను elevate చేసిన perfect lenses and camera movement . ఫీల్ ని , ఎమోషన్స్ ను బాగా పండించిన అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ . అచ్చు గుద్దినట్లు సరిపోయిన cool color tint . DI added a lot to its visual freshness. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి . ఇది అతనికి కేవలం రెండో సినిమానే . కానీ బాగా రాసుకుని, ఓ master లా తాను అనుకున్నది direct చేసుకోగలిగాడు . నటన అందరు బాగానే చేసారు .

Gangareddy.A

నాని మార్కట్ వున్న హీరో . మార్కెట్ ఉన్న హీరోలు సహజంగానే తమకు తగ్గట్లుగా commercial elements అనే వంకతో అక్కడక్కడ కథను artificial jone లోకి తీసుకెళ్తుంటారు . ఇక్కడ హీరో గానీ , ప్రొడ్యూసర్ గానీ కథ డిమాండ్ ను అర్థం చేసుకున్నట్లు వున్నారు . అందుకే screenplay ఏ disturbance లేకుండా, ఓ లైఫ్ లాగా సాగిపోతుంది . ఇందులో నాని హీరో కాదు, కథ హీరో. అందుకే ఇది ప్రత్యేక౦ . ఇట్లాంటి సినిమాలు పక్క రాష్ట్రాల్లో ఎప్పుడో మొదలైనా మన దగ్గర ఇప్పుడిప్పుడే liberation వైపు నడుస్తున్నట్లు అనిపిస్తుంది . చూడాలి ఇంకెన్ని వస్తాయో ? .మొత్తానికి పిల్లలతో , ఫ్యామిలీతో అందరు చూడదగ్గ చక్కటి సినిమా ఇది . నాని తన monotony నుండి బయటపడ్డాడు. నాకైతే నాని సినిమాలన్నిటి లోకి ఇదే బెస్ట్ మూవీ . పక్క రాష్ట్రాల వాళ్లకు కూడా రిఫర్ చేయదగ్గ తెలుగు సినిమా .(చిన్న జాగ్రత్త తీసుకుని వుంటే బాగుండేది : హీరో ఫైనల్ మ్యాచ్ గెలుస్తున్న part లో , డయాస్ దగ్గర నిజం తెలిసిన తరువాత , ఈ రెండు సంఘటనల్లో భార్య Pain /రియాక్షన్ /ఎమోషన్/ realization అనుకున్నంత రాలేదేమో ! ఎందుకంటే conflict ఆమెతో కూడా వుంది కాబట్టి . ) – GangaReddy.A

Share.

Leave A Reply