నదులు అనుసంధానిస్తే, శ్రీకాకుళం మాగాణి గా మారదా?

Google+ Pinterest LinkedIn Tumblr +

సహజ వనరులకు పెట్టిందిపేరు శ్రీకాకుళం జిల్లా… ఈ వెనుకబడ్డ జిల్లాలో రెండు పెద్ద నదులు మరో రెండు నదులున్నాయి. నాగావళి, వంశధార, మహేంద్రతనయ , బహుదానది. శ్రీకాకుళం పట్టణంగుండా నాగావళి పరుగులెత్తితే… ఇచ్చాపురం (ఉత్తరాంధ్ర చివరి పట్టణం) మీదుగా వెళ్తుంది బహుదానది. అంటే జిల్లాలో నాలుగు జీవధారలున్నాయన్నమాట. అయినా జిల్లాలో అధిక భభూగం వర్షాధారమే… పంటలు వస్తే పండుతాయన్న గ్యారెంటీ లేదు.జిల్లాలో పూర్తిస్థాయిలో సాగునీటి వనరులు ఉన్నా చా లా ప్రాంతాల్లో ఏటా ఒకే పంట పండించే పరిస్థితి. సాగు నీటికోసం ఆకాశంవైపు చూడాల్సిన దుస్థితి. వంశధార – బహుదా నదులను అనుసంధానిస్తే… జిల్లా మొత్తం బంగారు భూమిగా మారి ఏడాదికి మూడు పంటలు పండించే మాగాణి అవుతుంది. ఈ దిశగా పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జస్ట్ 53 కోట్లు కేటాయిస్తే నాగావళి వంశధార నదులను అనుసంధానించి… 37,000 ఎకరాలు స్థిరీకరణ, 5,405 ఎకరాలు కొత్తగా సాగులోకి తీసుకురావచ్చు. వంశ ధార నుంచి ఎక్కువగా వృథాగా సముద్రంలో కలిసిపోయే నీటిని పంటలకోసం వినియోగించుకోవ్చు. వంశధార – బహుదానది అనుసంధానం కోసం 116 కిలోమీటర్ల మేరక కాలువ తవ్వడం వల్ల ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరతాయి. రెండు లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించొచ్చు.

ఉద్దానంతోపాటు ఇచ్ఛాపురం శివారు ప్రాంతాలకు సాగునీరు, తాగునీటికి ఇప్పటికీ కరువే. ఏటా ఒక పంటకే నీరు అందక రైతులు పడే కష్టాలు అన్నీఇన్నీకావు. అటు తాగు నీటికీ సోంపేట, మందస, కంచిలి, పలాస, ఇచ్ఛాపురం పట్టణాలు ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ఉద్దానం కిడ్నీ సమస్యకు కూడా ప్రధాన కారణం ఇదేనని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. హిరమండలం నుంచి వంశధార జలాలను హైలెవెల్‌ కాలువ ద్వారా బాహుదాకు మళ్లించడానికి రూ.6326 కోట్లు అవసరమని సాంకేతిక నిపుణులు వెల్లడించారు. ఒనగూరే ప్రయోజనాలతో పోలిస్తే ఇదేమంత పెద్దమొత్తం కాదు. దీనివల్ల రెండు లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, ఉద్దానానికి పుష్కలం గా తాగునీరు అందించొచ్చు.

వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ తది తర నదులు వర్షాకాలంలో పుష్కలంగా నీరు వస్తున్నా అందిపు చ్చుకోవడంలో విఫలమవుతూ వస్తున్నాం. దీంతో ఒక్కపంట తోనే రైతులు సరిపెట్టుకుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడలేదు. సిక్కోలుకు సాగునీటి పండగ తెచ్చేందుకు పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలి. జిల్లాకు శాశ్వత ప్రయోజనం చేకూర్చాలి. దీనివల్ల వలసలను అరికట్టవచ్చు. అతివృష్టి అనావృష్టి. నివారించవచ్చు – Srinubabu Gedela

Share.

Leave A Reply