ఒకే పుస్తకంలో 31 జిల్లాల సమగ్ర సమాచారం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకే పుస్తకంలో 31 జిల్లాల సమగ్ర సమాచారం
కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం 31 జిల్లాల గణాంకాలతో రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివరించే 2017 సంవత్సర గణాంక వివరాల పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అనేక కీలకాంశాల సమాచారం ఇందులో ఉంది. బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌, నీతీ అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, సభ్యుడు రమేష్‌టచంద్‌,ఆర్దిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్ర సలహాదారు ఎకెగోయల్‌ ,జిఆర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, ప్రణాళికాశాఖ ప్రత్యే ప్రధాన కార్యదర్శి బిపీ ఆచార్య తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇటీవలి సర్వేలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. జనాభా,వైద్య,ఆరోగ్యం,వాతావరణం,వ్యవసాయం,సాగునీరు,అడవులు,పరిశ్రమలు,ఉపాధి,విద్యుత్తు, రవాణా, కమ్యూనికేషన్లు, పబ్లిక్‌ ఫైనాన్స్‌, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బ్యాంకులు, కార్మిక ఉపాధి కల్పన, విద్య, ఆర్థిక గణాంకాలు, స్థానిక సంస్థలు, సహా ప్రజాప్రతినిధుల వివరాలను పొందుపర్చారు. అనేకాంశాలు ఇందులో ఉన్నాయి

Share.

Leave A Reply