ఎర్రచీమల కారపు పొడి రుచిచూస్తారా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ ప్రాంతంలో కరోనా లేదని గతంలో రాశాం.అసలెందుకు లేదని లోతుగా స్టడీ చేస్తే

వీరి ఆహారపు అలవాట్లే అని తేలింది.

‘‘ ఈ రిమోట్‌ ఆదివాసీ తండాల్లో దగ్గు, శ్వాస కోస వ్యాధులు, వైరల్‌ జ్వరాలు  ఎక్కువ. వాటి నుండి  కాపాడుకోవడానికి, ఎర్రచీమలను పట్టి,వాటికి ఎండుమిర్చి, అల్లం కలిపి పచ్చడి చేసుకొని అంబలిలో తింటారు. అలా రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు..’’ అన్నారు వీరి మధ్య పనిచేస్తున్న డాక్టర్లు.

 కోస్తా ప్రాంతంలో   ఎండు రొయ్యలకు కారం కలిపి పొడి చేసుకొని వాడుతుంటారు. మరి ఎర్రచీమల   పొడిని ఎందుకు చేయకూడదు?  ఆదివాసీలతో ఒక MOU  కుదుర్చుకుందామని , భద్రాద్రి  అడవులకు వెళ్తున్నాం. (చీమల ఆహారం పై గతంలో రాసిన స్టోరీని ఇక్కడ చూడండి.)

Share.

Leave A Reply