ఎక్కడ చెట్టు కనబడ్డా ఒక హీరోని చూసినట్లు చూసేవాడిని..|అరణ్య స్పర్శ 1

Google+ Pinterest LinkedIn Tumblr +

( By AranyaKrishna)

అరణ్యం! నా దృష్టిలో ఒక గొప్ప తాత్విక పదం. కిక్కిరిసిపోవటం, చిక్కగవుండటం, సాంద్రవంతంగా వుండటం, దట్టంగా వుండటం, వైవిధ్యవంతంగా వుండటం, నిశ్శబ్దంగా వుండటం, మంద్రధ్వనితో వుండటం, మార్దవంగా వుండటం, మార్మికంగా వుండటం, భిన్న జీవజాతులకు సహజావాసంగా వుండటం, సృష్టి-స్థితి-లయలతో శివాత్మకంగా వుండటం, ఇంకా నేను చూడలేనన్ని రకాలుగా, వర్ణించలేని విధాలుగా వుండటం ఒక్క అడవికే సాధ్యం. అందుకే అడవంటే నాకో ఉన్మత్త ఆరాధన, ఉన్మాద ప్రేమ కూడా! పుట్టినప్పటి నుండి నగరాల్లోనే బతికిన వాడిని. కనీసం గ్రామీణ జీవితం కూడా పెద్దగా అనుభవంగా లేని వాడిని. కానీ చెట్టంటే ఇష్టం. ఎక్కడ పెద్ద చెట్టు కనబడ్డా ఒక హీరోని చూసినట్లు చూసేవాడిని. అటువంటిది వేలాది మహావృక్షాలు, లక్షలాది చెట్లు, కోట్లాది మొక్కలతో, వాగులు, జలపాతాలు, నదులు వంటి ప్రాకృతిక జల శరీరాలతో, ఆది మానవుడి గుహలతో, అనంతానంత జీవ వైవిధ్యంతో మనిషి ఇప్పటికీ నాశనం చేయకుండా లేదా చేయలేక వదిలేసిన అరణ్యం ఈ సృష్టిలో నాకు అత్యంత సమ్మోహకం. అడవిని నేనేమీ అధ్యయనం చేయను. అడవి గురించి శాస్త్రీయంగా తెలియదు. నేనిష్టపడే వాటి గురించిన పరిజ్ఞానం వుండాలని అనుకోను. ఆ మాటకొస్తే నాకు ఇంట్లో మొక్కలెలా పెంచాలో కూడా సరిగ్గా తెలియదు. జ్ఞానం పట్ల ఆసక్తి తక్కువ. బహుశ చిన్నప్పుడే జిడ్డు కృష్ణమూర్తి ప్రభావంలో పడటం కావొచ్చు. మరీ లోతైన జ్ఞానం అనుభూతిని కప్పేస్తుందనే అభిప్రాయంతో వుండేవాడిని. మనుషుల పట్ల కూడా ఇలాగే వుంటాను.

క్రితం సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో నా కవితాసంపుటి “కవిత్వంలో ఉన్నంతసేపూ….” చిత్తూరు జిల్లా, తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లోని పలమనేరు మండలంలోని ఏనుగుల సంరక్షణ ప్రాంతంగా ప్రకటించబడ్డ దేవళం అటవీ ప్రాంతంలో ఓ ఆదిమ గుహలో ఆవిష్కరణ జరిగింది. మళ్ళీ సంవత్సరం తరువాత మరోసారి అడవిలోకి వెళ్ళే అవకాశం వచ్చింది. క్రితం సారి Palamaner BalajiGandikota Varijaలా ఈ సారి మిత్రులు శ్యాంసుందర్ గారు ముందుకొచ్చారు. “అడవి చూడాలంటే ఇదే సరైన సమయం. ఏదో కార్లేసుకొని అడవిలో రహదార్ల మీద చెట్లని చూస్తూ తిరగటం కాదు. కాలి నడకన మూలమూలకూ వెళ్ళి, ఎక్కడ పడుకుంటామో తెలియనంత అజ్ఞాత ప్రాంతాలకు వెళ్ళే సాహసం చేద్దాం. వస్తారా?” అని అడిగారు. కాదనగల ఆఫరా అది? శ్యాం సుందర్ గారు మంచుకొండలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసిన అనుభవం వున్నవారు. అడవితో సావాసమంటే, అడవిలో సాహసమంటే ఇష్టపడే వారు. అందుకే ఆయన రెగ్యులర్గా ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశ్యంతో తన గిరిజన మిత్రులతో కలిసి మారేడిమిల్లిలో మంచి కాటేజీ కూడా నిర్మించారు. వెంటనే సై అన్నాను. “నవంబర్ 25 నుండి మూడు రోజుల పాటు ప్లాన్ చేస్తున్నా” అన్నారు. ఇది ఆయన నిర్వహిస్తున్న మొదటి ట్రెక్కింగ్. ఈ ట్రిప్ లోనే “బైసికిల్ బర్డ్స్” జయతి, లోహితాక్షన్ దంపతులు కూడా జాయిన్ అవుతున్నట్లు చెప్పారు.

నవంబర్ 23 రాత్రి ట్రెయిన్లో బయలుదేరాం నేను మిత్రుడు వేణు. అర్ధరాత్రి కొత్తగూడెం దిగి, శ్యాం సుందర్ గారిని కలిసి, అక్కడి నుండి భద్రాచలం వెళ్ళి, మళ్ళీ అక్కడి నుండి మారేడిమిల్లి చేరుకున్నాం. మారేడిమిల్లిలో ఆయన రెండెకరాల స్థలంలో పూర్తిగా చెక్కతో నిర్మించిన అందమైన కుటీరం ఆహ్వానం పలికింది. అక్కడికి అప్పటికే రెండు రోజుల క్రితమే వచ్చిన జయతి, లోహితాక్షన్లు చిర్నవ్వులతో కనిపించారు. (వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి.) ఆ తరువాత కొద్దిసేపటికి యువజంట Sandeep NagamalliSurishetty Kalpanaకూడా జత అయ్యారు. ఆ విధంగా మొత్తం ఏడుగురం అయ్యాం.
(మిగతా రేపు)

నోట్: నేను పైన శివాత్మకంగా అని రాసాను. దానర్ధం నేను శివభక్తుడినని కాదు. నాకు ఎటువంటి దైవ విశ్వాసాలు లేవు. కానీ కొన్ని ఆధ్యాత్మిక భావనలు నచ్చుతాయి. శివతత్వంలోని (నాకర్ధం అయిన మేరకు) వైరాగ్యం, ప్రకృతి, మృత్యువు పట్ల నిష్కర్ష తాత్వికత, శివుడి సింబాలిక్ వేషధారణ ఆసక్తికరంగా, తాత్వికంగా అనిపిస్తుంటుంది. తాత్వికతని పురాణస్థాయికి దింపిన శివపురాణం అంటే చిరాకు. ఆ మాటకొస్తే ఒక కల్లోల సామాజిక సందర్భంలో సమాజాన్ని గాడిలో పెట్టడానికి ఒక నిర్దిష్ట జీవన విధానాన్ని నిర్దేశించిన మహమ్మద్ ప్రవక్త చెప్పిన కొన్ని అంశాలు కూడా నచ్చుతాయి. అలాగే జీసస్, బుద్ధుడు కూడా. కానీ దైవారాధనకీ, భక్తికీ నాకు చాలా దూరమే కాదు, పడదు కూడా. అలాగని నాస్తికత్వాన్ని ప్రచారం కూడా చేయను. దైవ విశ్వాసం, అవిశ్వాసం వ్యక్తి స్వేఛ్చగా, ఐఛ్చికంగా భావిస్తాను. అసలు విషయం వదిలేసి మిత్రులు దీని మీద చర్చ చేయొద్దనే ఇంత వివరంగా చెబుతున్నాను.

Rural media ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1,గాలిలో పెరిగే అడవి ఆలు గడ్డలు…https://youtu.be/nNS8nC72-ZA

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు, అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

8, ఊరికి ఉపాధి కోసం ఒక అమ్మాయి ఏమి ఎమిచేసిందో తెలుసా ?https://youtu.be/LAu0dC-th5w

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .Share on:

Share.

Leave A Reply