గ్రామీణుల కోసం, విద్య, నైపుణ్య కేంద్రం

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీసిటీ(Chittore district ) లోని  ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్నాన్సెస్ (ఐఎఫ్ఎఫ్) పరిశ్రమ యాజమాన్యం తమ సీఎస్ఆర్ చర్యల్లో భాగంగా రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ (రీడ్) సంస్థ భాగస్వామ్యంతో శ్రీసిటీ పరిధిలోని ఇరుగుళం గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ లైబ్రరీ & రిసోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. బుధవారం ఉదయం ఐఎఫ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.జి.ప్రకాష్ దీనిని లాంఛనంగా ప్రారంభించగా, రీడ్ ఇండియా కంట్రీ డైరెక్టర్ డాక్టర్ గీతా మల్హోత్రా, శ్రీసిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రమణ్యం, క్రియా యూనివర్సిటీ లైబ్రరీ సైన్సెస్ డీన్ డాక్టర్ రాగశ్రీ కిషోర్, ఐఎఫ్ఎఫ్ గ్రేటర్ ఆసియా డైరెక్టర్ (లీగల్) చాండీ తంబీ, ఇరుగుళం గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా డాక్టర్ గీతా మల్హోత్రా మాట్లాడుతూ, ఇరుగుళం గ్రామంలో రీడ్ కమ్యూనిటీ లైబ్రరీ మరియు రిసోర్స్ సెంటర్  (CLRC) వలన ఒనగూరే ప్రయోజనాలను  వివరించారు. ఈ తరహా సెంటర్లను ప్రభుత్వాలు, స్పాన్సర్ల మద్దతుతో గ్రామస్థుల భాగస్వామ్యంతో తమ సంస్థ భారతదేశం అంతటా 12 రాష్ట్రాలలోని 18 జిల్లాలలో 228 గ్రామాలలో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.  
విద్య, కమ్యూనిటీ అభివృద్ధిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా లైబ్రరీ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు ఐఎఫ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.జి.ప్రకాష్ పేర్కొన్నారు. దీనిని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో, ఐఎఫ్ఎఫ్ పరిశ్రమ యాజమాన్యం రీడ్ ఇండియా ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు.  ఇరుగుళంలో సెంటర్ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, ఈ గ్రామస్థులు, ముఖ్యంగా విద్యార్ధులు, మహిళలు, దీని నుండి మంచి ఫలితాలను పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

దేశంలో ఐఎఫ్ఎఫ్ పరిశ్రమ వితరణతో చేపట్టిన 3వ రీడ్ కమ్యూనిటీ లైబ్రరీ మరియు రిసోర్స్ సెంటర్ ఇరుగుళంలో ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో ఇది మొదటిది. పిల్లలకు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలతో పాటు, యువతి యువకులకు చేతివృత్తులు, ఆరోగ్య అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.  రీడ్ ఇండియా సంస్థ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న రీడ్ గ్లోబల్ యొక్క అనుబంధ సంస్థ.  ఇది ఎలాంటి లాభాపేక్షలేకుండా ప్రాథమిక విద్యా సౌకర్యాలు లేని గ్రామీణ ప్రజలకు సమాచారం మరియు అవకాశాలను అందిస్తుంది. కమ్యూనిటీ లైబ్రరీ మరియు రిసోర్సు సెంటర్లో లైబ్రరీ, కంప్యూటర్ రూమ్, శిక్షణా హాల్ మరియు పిల్లలు, మహిళలకు విభాగాలు ఉన్నాయి.   సమాజంలో అవసరాల అంచనా ఆధారంగా కమ్యూనిటీ సభ్యులకు ఎలాంటి నైపుణ్య శిక్షణ ఇవ్వాలో నిర్ణయించబడతాయి, ఇరుగుళం  గ్రంథాలయంలో డిజిటల్ ఆధారిత లెర్నింగ్ కోసం ఆడియో – వీడియో కంటెంట్తో సహా రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ తో పాటు, పోటీ పరీక్షలకు,  ఉన్నత విద్యలకు అవసరమైన ఇ-కంటెంట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

Share.

Leave A Reply