కరవును జయించిన ముస్లిం మహిళలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఊరంతా కరవు. పంటలు లేక మగాళ్లు కాడి పడేసి,వలస పోతున్నారు. అలాగని ఆ ఊరి మహిళలు నిరాశపడకుండా,జుబేదాబీ నాయకత్వంలో సంఘటిత శక్తిగా మారారు. పశుపోషణ చేపట్టి పశువుల కోసం ఏకంగా ఓ వసతి గృహాన్ని నిర్మించారు. ఒక పూట కూలి పనులు, మిగతా సమయం పశువుల పోషణ చేపట్టి పేదరికానికి ఎలా చెక్‌ చెప్పారో చూడండి.
కరవుతో అలమటించే కల్లూరు మండలం, తడకనపల్లి గ్రామం (కర్నూల్‌జిల్లా)లో వ్యవసాయం తగ్గిపోవడంతో పాడిపరిశ్రమ మీద ఎక్కువ కుటుంబాలు ఆధారపడ్డాయి. ఐతే నిత్య కరువుతో రైతులకు తమ కుటుంబాల కడుపు నింపడమే కష్టమయి, పశుగ్రాసం కొనలేక, వాటి పోషణ భారమైంది.
సంప్రదాయ పంటలు తగ్గిపోయి, పొగాకు, పత్తి వంటి వాణిజ్య సాగు పెరిగిపోతుండటంతో, పశువుల మేత దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో పశువులను అమ్మేసుకోవడమో లేక వధ్యశాలకు తరలించడమో చేస్తున్నారు. ఇలా బలవుతున్న మూగజీవాలను రక్షించి, సరైన పోషణ లేక బక్కచిక్కిన దేశీయ పశు సంపదని పెంచడంతో పాటు, తమ జీవనోపాధులు మెరుగు పర్చుకోవాలని మహిళలంతా నిర్ణయించుకున్నారు.
పూర్తి కధనం ఆంధ్రజ్యోతి ఆదివారం మ్యాగజైన్‌లో చదవండి…

andhrajyothi-sunday-23-12-2018

andhrajyothi-sunday-23-12-2018

Share.

Leave A Reply