వైఎస్సార్‌ జలకళ,కంటే మెరుగైన పనులు ఇవిగో…

Google+ Pinterest LinkedIn Tumblr +

మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్   ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయబోతుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను తీర్చాలి అనుకోవడం మంచిదే కానీ, భూగర్భ జలాలను తోడి వేయడం పర్యావరణ హితం కాదు.

జలకళ పథకం కొత్తది ఏమీ కాదు, ఉపాధి హామీ పథకం నిధుల తో గత ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరులు అని వేలాది బోర్లు వేశారు. అదే స్సీమ్ ఇప్పుడు  వైఎస్సార్‌ జలకళ గా జగన్ ప్రభుత్వం మొదలు పెట్టింది.

దీని కంటే మెరుగైన పని …

వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లు ఈ ఏడాది మార్చి నెలాఖరు ఏపీలో నాటికి 18.01 లక్షలున్నాయి. 

 భూగర్భ జలాల కోసం 20 మీటర్ల (65.6 అడుగుల)కుపైగా లోతుగా తవ్వాల్సిన ప్రాంతం అత్యధికంగా అనంతపురంలో ఉంది. దీంతో వందల అడుగుల లోతు వరకూ బోర్లు వేసి, నీరు పడక నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. కొన్ని చోట్ల నీరు పడినా, ఆ తర్వాత కొద్ది కాలానికే బోర్లు ఎండిపోతున్నాయి.

ఇలాంటి  పరిస్తితీలో ఇప్పుడు చేయాల్సింది , వాన నీటిని ఒడిసి పట్టడం. దాని కోసం కరవు ప్రాంతాల్లో చెక్ డ్యామ్స్ , వాలు కట్టలు, గుట్టలమీద కందకాలు తవ్వాలి. చిన్న నదులు, వాగులు కింద కూడా చెక్ వాల్స్ నిర్మించాలి. ఈ పనుల వల్ల ఎండిన బోర్లు, బావులు కూడా రీచార్జ్ అవుతాయి.  డ్రిప్, తుంపర  సాగును ప్రోత్స హిస్తే, భూగర్భ జలాలను పొదుపు చేయ వచ్చు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

farm pond,guruvajipet.

  ‘ గడచిన ఐదారేళ్లలో చూస్తే ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. గతం లో పంట కుంటలు తవ్వడం చెక్ డ్యామ్స్, వాలు కట్టలు గుట్ట చుట్టూ కందకాలు ఏర్పాటు చేసు కోవడం వల్ల పడిన వానంతా భూమిలోకి ఇంకింది.  రైతులకు నీటి లోటు లేదు. పంటలన్నీ బాగా పండుతున్నాయి.’ అని, ప్రకాశం జిల్లా గురువాజీ పేట రైతులు, వెంకట సుబ్బయ్య,వెంకటేశం అన్నారు. 

Share.

Leave A Reply