వానలు లేక, ఈ ప్రాంతంలో పశువుకు గడ్డి కూడా మొలిచేది కాదు. పాడిపంటలు లేక రైతులు పట్నం వైపు పోయి కూలీ వెతుక్కో సాగారు. ఇదంతా నాలుగేళ్ల క్రితం విషాదం. ఆ తరువాత ఊరంతా శ్రమించి ఇక్కడో చెక్‌డ్యామ్ కట్టారు. వీరి టైం బాగుండి ఈ సారి విస్తారంగా వానలు కురిశాయి. పడిన ప్రతీ బొట్టు ఇక్కడ ఆగింది. ఊరంతా పంటల తో కళకళలాడింది .జామ,సపోటా,యాపిల్ బేర్‌తో పాటు చెర్రీలు కూడా పండిస్తున్నారు. భూమిలోని నీళ్లను విచ్చల విడిగా తోడేసే ‘ఉచితబోర్లు( వైఎస్సార్ జలకళ} పథకాలు కాకుండా ఆంధ్రా సర్కారు వాన నీటిని నేల లోకి ఇంకించే, చెక్ డ్యామ్‌లు, వాలులో కందకాల పై దృష్టి పెట్టాలి.
దైవాలరావూరు,( ప్రకాశం జిల్లా)లో మా ruralmedia తీసిన వీడియో ఇది. https://youtu.be/TWMDjXeLHII
నాలుగేళ్ల క్రితం,IWMP పథకంలో నిర్మించిన చెక్‌డ్యామ్ వల్ల, నేడు ఊరంతా పచ్చదనం పరుచుకుంది,

‘‘ ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్‌లు , రాతి కట్టలు , పంటకుంటల్లో పూడిక తీయడం వల్ల 2019లో కురిసిన భారీ వానకు భూగర్భజలాలు పెరిగాయి.బావు,బోర్లలో జమట్టం పెరిగింది. కాయగూరల తో పాటు, చెర్రీ తోటలు కూడా ఎదుగుతున్నాయి.’’ అన్నాడు, ప్రకాశం జిల్లా, దైవాల రావూరుకు చెందిన యువ రైతు రవి.