కొత్త సైబర్‌ మోసం, తస్మాత్‌ జాగ్రత్త!!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాములు ఏదైనా బిజినెస్‌ చేసి స్వయం ఉపాధి పొందాలనుకున్నాడు. ప్లాస్టిక్‌ని నివారించడానికి, పేపర్‌ ప్లేట్‌లు తయారు చేసి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి అవకాశాల కోసం, నెట్‌లో వెతుకుతుంటే, OLX లో పేపర్‌ ప్లేట్స్‌ తయారు చేసే మెషిన్‌ అమ్మకానికి ఉందని తెలిసి, అది అమ్మే వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించాడు.
మిషన్‌ అమ్మే వ్యక్తి రాముని ముందుగా కొంత అడ్వాన్సు కావాలని కోరగా, రాములు అతని ఖాతాలో కొంత డబ్బు వేసాడు.
అలా జిఎస్‌టీ కొంత, డెలివరీ చార్జెస్‌కి మరి కొంత కావాలని రాములు నుండి రూ.1,35,000 తీసుకొని, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసాడు.
చివరికి రాములు ఆ అపరిచితుడి చేతిలో మోససోయినట్టు తెలుసుకున్నాడు. కానీ అప్పటికే చాలా నష్టపోయాడు.
ఇలాంటి మోసాలు ఇటీవల బాగా పెరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.
నిత్యం స్మార్ట్‌ ఫోన్‌లో బిజీగా ఉండే ప్రజలను సైబర్‌ నేరగాళ్లు మీ అవసరాన్ని బట్టి మిమ్మల్నిఅనేక మార్గాల్లో మోసం చేయబోతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తోంది, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ.

” ఎవరితో నైనా ఆర్ధిక లావా దేవీలు జరపాలనుకున్నపుడు, ముందుగా ఆ వస్తువు అమ్మే వ్యక్తిని కలవకుండా, వస్తువుని చూడకుండా ఆన్‌ లైన్‌ మార్కెట్‌ లో ఆర్థిక లావాదేవీలు అసలు జరుపకండి.” పోలీసులు మరీ,మరీ హెచ్చరిస్తున్నారు.
ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దన్‌ క్యూర్‌ !!

Share.

Leave A Reply