ఈ రొయ్యలు రెండేళ్ళుఅయినా చెడిపోవు..

Google+ Pinterest LinkedIn Tumblr +

పూడిమడక సముద్రతీరం సందడిగా ఉంది. వారం క్రితం బోట్లలో డీజిల్, ఐస్, ఆహారం తీసుకొని కెరటాలకు ఎదురొడ్డి, వేటకు వెళ్లిన జాలరులు ఆ రోజు సాయంత్రం తీరానికి చేరుకుంటారని తెలిసి, వాళ్ల కోసం వెయిటింగ్….
అలలు తగ్గినట్టున్నాయి… తీరం నిశ్శబ్దంగా ఉంది. పాదాల మీద నుండి పాకుతూ, ఎర్రపీతలు ఇసుకలోని బొరియల్లోకి దూరుతున్నాయి. ఇంతలో ఒక పెద్ద కెరటం వచ్చి కాళ్ల కింద ఇసుకను తోసుకుంటూ వెనక్కి వెళ్లి పోయింది. నా ఆలోచనలు కూడా ప్లాష్ బ్యాక్ లోకి మళ్లాయి…
………………….
రాయల సీమలో చిన్నపల్లెలో ఒక కేస్ స్డడీ కోసం తిరుగుతున్నాం. ఉదయం అయిదుకి ఫీల్డ్ కి వెళ్లాం… రెండు గ్రామాలు కవర్ చేసేటప్పటికి మధ్యాహ్నం రెండున్నర దాటింది. ఆకలి దంచేస్తుంది. ఎక్కడా హోటళ్లు లేవు.. చివరికి ఒక మెస్ కనిపించగా లోపకి వెళ్లాం.
కడిగిన లేత అరిటాకులు పరిచి, ‘‘పప్పుటమాటా, దొండకాయ కూర మాత్రమే ఉంది…’’ వడ్డించనా… అన్నాడు సప్లయర్.
నాన్వెజ్ ఏమీ లేదా ? అన్నాడు మా వెంట వచ్చిన మిత్రుడు.
‘‘ ప్రాన్స్… వేపుడు.. ఉంది. ’’ అన్నాడు.
‘‘ఇక్కడ తాజాగా ఉంటాయా?’’అనుమానంగా అడిగాం…
తినండి.. బాగుంటే బిల్ పే చేయండి అన్నాడతను ధీమాగా…
రెండు ప్లేట్లు రప్పించి నలుగురం షేర్ చేసుకున్నాం. కొత్తిమీర ఎక్కువ వేసి ఫ్రై చేశారు, రుచిగానే ఉంది. ఎవరూ వంక పెట్టకుండా తిన్నారు.
బయటకు వచ్చి కౌంటర్ దగ్గర ఉన్నతనికి బిల్ పేచేస్తూ ….
‘‘ ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ లేదు కదా… రొయ్యలు ఎక్కడ తెచ్చారు… చాలా టేస్టీగా ఉన్నాయి ? ’’ అని అడిగా..
‘‘ మీరు రుచిచూసింది చెరువుల్లో పెరిగినవి కాదండీ, సముద్రపు రొయ్యలు ..’’ అన్నాడతను నవ్వుతూ…
లోపలి నుండి ఒక ప్యాకెట్ తెచ్చి చూపిస్తూ…
‘‘ ఇవి విశాఖ తీరం లో పట్టినవి. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాజీతో ప్యాకింగ్ అయి వస్తున్నాయి. వేడినీళ్లలో వేస్తే అయిదు నిముషాల్లో తాజాగా తయారవుతాయి. మనకు నచ్చిన పద్దతిలో వండుకోవడమే.. ఈ ప్యాక్ లు మూడేండ్ల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.’’ అన్నాడు కూల్ గా…
చాలా ఇంట్రస్టింగ్గా ఉంది. ఫుడ్ టెక్నాజీలో ఇంత మార్పు వచ్చిందా ? మనసులో అనుకొన్నా…
ఆ సీన్ అలా కట్ అవ్వగా…
………………………
ఇంత కాలానికి ప్రాన్స్ ప్రాసెస్ చేస్తున్న వారి వివరాలు దొరకడంతో ఈ సాగర తీరానికి వచ్చాను.
దూరంగా అరుపు లు వినిపించాయి. పొడవైన పడవను గట్టుకు లాగుతూ లయబద్దంగా … ఒహో..ఒహో…అని అరుస్తూ వస్తున్నారు వేట గాళ్ళు.
‘‘ ఆటుపోట్ల మధ్య రొయ్యల వేట… మామూలు విషయం కాదయ్యా…’’ అంది మా పక్కనే బుట్టతో నిలబడిన పల్లె మహిళ.
ఈ సారి చేపల కంటే రొయ్య లు బాగా దొరకడంతో, వారంతా కుషీగా ఉన్నారు…
( సమగ్రమైన స్టోరీ కింద AndhraJyothi క్లిప్పింగ్ లో చదవండి…) contact-9440595858

28.6.2020-andhrajyothi
Share.

Leave A Reply