సినిమా దర్శకుల్లో తాత్వికుల జోరు| Aranya Krishna

Google+ Pinterest LinkedIn Tumblr +

సినిమాటిక్ ఫిలాసఫర్స్!

ఈ మధ్య తెలుగు సినిమా దర్శకుల్లో తాత్వికుల జోరు మొదలైంది. తాము తీస్తున్న అతి సాధారణ సినిమాలను కూడా డబ్బులిచ్చి చూస్తున్నారు కదాని ప్రేక్షకుల జీవితాల్ని చక్కదిద్దటానికి పూనుకుంటున్నారు. జనాన్ని వేలు పట్టుకొని నడిపించాలనుకుంటున్నారు. వాళ్లకి వ్యక్తిగత జీవితానికి, సమాజానికి సంబంధించి దృష్టికోణాల్ని మప్పటానికి తమ విలువైన సమయాన్ని ఖర్చుపెట్టేస్తున్నారు పాపం.

ఇన్నాళ్లపాటు మనకి రాంగోపాల్ వర్మ ఒక్కడే వుండేవాడు దర్శక తాత్వికుడిగా. అరాచకాన్ని తాత్వికత అనే గొడుగు కిందకి తేవటం ఆయనకో సరదా. ఆయనని చూస్తే అరాచకత్వానికి స్వార్ధమే పునాది అనే విషయం స్పష్టం అవుతుంది. సక్సెసే పెద్ద నైతిక విలువగా భావిస్తూ, మైట్ ఈజ్ రైట్ అనే స్కూల్ కి చెందిన ఈయన గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. త్రివిక్రం శ్రీనివాస్ తానేమీ ప్రత్యేకంగా ప్రేక్షకులతో “ఫిలసాఫికల్” గా కనెక్ట్ అవలేదు కానీ ఆయన్ని తెలుగు మీడియా జ్ఞానులు మాత్రం ఒక గొప్ప మానవ సంబంధాల సత్యాన్వేషకుడిగా, ప్రవర్తనా పరమైన విలువులకి సంబంధించి గొప్పగా కొటేషన్స్ ఇచ్చేవాడిగా ప్రచారం చేసారు. ఆయన్ని మాటల మాంత్రికుడిగా కీర్తించారు. నా దృష్టిలో ఆయన మాటల మాంత్రికుడు కాదు. హీరోయిజానికి శవపూజారి. ఎడారిలో మంచినీళ్ల బాటిల్ కోసం పీకలు కోసే హీరోని (ఖలేజ సినిమాలో) సమున్నతంగా చూపించాలనుకునే నీచ భావాల కువిక్రముడు. సంపన్నుల ఒళ్లు బలుపు ప్రవర్తనని వ్యంగ్యంగా కాక వారి హక్కుగా (అత్తారింటికి దారేది?) చూపగల నికృష్ట దృష్టికోణం ఈయన స్వంతం. కానీ మన మీడియా ఈయన్నేదో మహానుభావుడన్నట్లు ఆకాశానికెత్తేస్తుంటాయి. అంతకుముందు మహా ఉదాత్తమైన సినిమాలు రాసాడని, తీసాడని కాదు కానీ ఏదో “స్వయంవరం” “నువ్వు నాకు నచ్చావ్”, “మన్మధుడు”, “నువ్వే నువ్వే” వంటి కాలక్షేపం బఠాణీల సినిమాలకు రాసి, తీసాడనకున్నా “అతడు” సినిమా నుండి ఆయన పతనం మరీ ఎక్కువైంది.

కాగా ఇప్పుడు పూరీ జగన్నాథ్ చేరారీ వరసలో. తన మ్యూజింగ్స్ తో తన హీరోల్లా జనాల్ని “రౌండప్” చేయాలని చూస్తున్నాడీయన. నేను ఈయన గారి ఆడియోస్ కొన్ని విన్నాను అసలీయనేం చెబుతున్నారా అని. కొన్ని వింటే అర్ధం అయిపోయింది ఈయనేమిటనేది! అసలిలాంటి వాళ్లు ఏం చెబుతారో తెలుసుకోవాల్నా అనే ప్రశ్న మీరేయొచ్చు. కానీ వినకుండా ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించే అమాయక ప్రజాస్వామికవాదులుంటారు కదా! నేను విన్న నాలుగైదు మ్యుజింగ్స్ ఆడియోస్లో ఈయన కొత్తగా చెప్పిందేమీ లేదు. ఆయన సినిమాల్లోని హీరోల చేత ప్రవచనాలు చెప్పిస్తుంటాడుగా అలానే ఇక్కడ జీవితం గురించి ప్రవచనాలు చెప్పాడు. ఈయన భావాలు, అవగాహనలు ఎప్పటిలా వెనకబడే వున్నాయి. “అమాయకత్వం” అనే శీర్షిక కింద చేసిన బోధనలో ఆయన ఆడవారిని సాధ్యమైనంతగా అవమానించాడు.

Real forest experience of Aranyakrishna
Aranyakrishna

కొసమెరుపేమిటంటే ఇది స్త్రీలని అవమానించటంగా భావించొద్దు అంటాడు. అతి తెలివి కాకపోతే! “నిరాడంబరత్వం” అనే మరో ఆడియోలో ఆయన సుందర్ పిచాయ్, సుధా మూర్తి, వారన్ బఫెట్ వంటి సంపన్నుల నిరాడంబరత్వాన్ని మైమరిచిపోయి మరీ పొగిడి వాళ్లకంటే మీరేం పీకుతున్నారని ఆడంబరంగా బతుకుతున్నారని బోలెడంత వదరబోత్తనం ప్రదర్శించారు. ఈ రెండు మూడు చాలు సమాజం గురించి, వర్గ విభజన గురించి, సాంఘీక వివక్ష గురించి, ప్రాధమిక అవసరాలు తీరని తనం ఎలా అశాంతిని కలగచేస్తుందనేది…..ఆ మాటకొస్తే ఆయనకసలేమీ ఈషణ్మాత్రంగా కూడా తెలియదని అర్ధమైపోతుంది. సొషల్ స్ట్రక్చర్, సోషల్ కేపిటల్, అడ్వాంటేజియస్ సెక్షన్ల నైతిక కబుర్ల జులుం, చట్టాల వైఫల్యమే కాదు వాటి అసంపూర్ణత్వం, పాలకుల మోసాలు…ఇవేవీ మాట్లాడకుండా నాలుగు పర్సనాలిటీ డెవలప్మెంట్ కబుర్లు చెప్పే ప్రతి ఉప్మా దోశగాడు తాత్వికుడు, ప్రవచనకర్త అయిపోతే ఎలా? ఇలాంటి సూడో తాత్వికులంతా భారతదేశమంటే మధ్యతరగతి ప్రజలు అనుకుంటారు. అన్నట్లు ఈయన కూడా ఆయన సినిమా హీరోల్లానే యథేచ్చగా నోటి దూల తీర్చుకున్నాడు. “నా కొడకా”, “దొంగ నా కొడకా”, వంటి పదాలు ధారాళంగా ఉపయోగించాడు. ఒక ఆడియోలో వినే వాళ్లని సంబోధిస్తూ “ఘూట్లే” అని కూడా అన్నాడు.

అయ్యా మీ అంత మోడర్న్ గా కాదు కానీ మీరు ముసుగులేసుకొని చెప్పే యథాతథవాద సిద్ధాంతాల్నే మాకెప్పుడో ఎందరో చెప్పారు. ఎక్కడా వ్యవస్థీకృత దోపిడీల్ని, అధికార వర్గాల్ని, పాలకుల్ని ప్రశ్నించాలని చెప్పని, హక్కుల కోణంలో మాట్లాడని మీ చెత్త భావాల్ని, మాటల దుమ్ముని మీ “డాష్ బోర్డ్”లోనే దాచుకోండి.

– Aranya Krishna

Rural media ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1,గాలిలో పెరిగే అడవి ఆలు గడ్డలు…https://youtu.be/nNS8nC72-ZA

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు, అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

8, ఊరికి ఉపాధి కోసం ఒక అమ్మాయి ఏమి ఎమిచేసిందో తెలుసా ?https://youtu.be/LAu0dC-th5w

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి

Share.

Leave A Reply