ఆమె వేసే బొమ్మలు చూస్తే, షాక్ అవుతారు ?

Google+ Pinterest LinkedIn Tumblr +

PENIS IS METAPHOR FOR PROTEST పురుషాంగం ఆమె జెండా, ఎజెండా!

మనమంతా మంచివాళ్ళం. మర్యాదస్థులం. చిన్నవాటికి, చితకవాటికీ సిగ్గుపడే వాళ్ళం.

ఎవరో ఎందుకు, నాకు చాలా సిగ్గు. ఇంకొంచెం మాంసం కూర కావాలి – అని అడగడానిక్కూడా సిగ్గే. నువ్వంటే నాకెంతో ఇష్టం అని చెప్పడానికి సిగ్గుపడి కనకమహాలక్ష్మిని కాలేజీ రోజుల్లోనే కోల్పోయాను.

అస్సలు సిగ్గులేని రావిశాస్త్రి గారు ఒక నవలలో
“వెంకట్రావు బాగా సిగ్గరి. భార్య ముందు కూడా బనీను ఇప్పట్ట” అని రాశారు. నా గురించి రావిశాస్త్రికి ముందే ఎలా తెలుసో – అని కొంత గింజుకున్నాను కూడా.

మన పెద్దవాళ్ళు కూడా ” సిగ్గు లేదా నీకు ” అని మందలిస్తూ ఉంటారు. ఎక్కడో ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాలని నాలాంటి జర్నలిస్టు గాళ్ళు జాతికి సందేశం ఇస్తుంటారు.

నీ సిగ్గు మొగ్గలైపోనూ.. అనీ, కొండొకచో బొగ్గులైపోనూ అనీ దీవిస్తూ ఉంటారు. దేనికైనా సిగ్గూ శరం ఉండాలనీ అంటారు. శరం అంటే నాకు నిజంగా తెలీదు. శరముల వలెనూ చతురోక్తులనూ చురుకుగ విసిరే నైజములే .. అనే పాట బాగా నచ్చుతుంది. అలాంటి బాణాల్లాంటి మాటలు మెత్తగా గుచ్చుకుంటాయి.

సిగ్గు పడటం అనేది మనకి ఒక సంప్రదాయం.
విషయం చిన్నదైనా, పెద్దదైనా సిగ్గుపడ్డానికి మనమేమాత్రం సిగ్గు పడం. ఇంత సిగ్గుపడే ఈ మర్యాదస్తుల సమాజం ఆడదాన్ని తిట్టడానికి, కొట్టడానికి, హింసించడానికి, రేప్ చేయడానికీ అదేంటో.. అస్సలు సిగ్గుపడదు. చంపి, కాల్చి
బూడిద చెయ్యడానికీ సంకోచించదు. మేం అనాగరికులం అనీ, ఆటవికులం అనీ రెండు రోజులకొకసారైనా నిరూపించుకోకపోతే మా మగాళ్ళకి అస్సలు నిద్ర పట్టదు. మనది సర్వసత్తాక, సర్వభ్రస్ట, సర్వావలక్షణ భూయిష్టమైన వర్ణనాతీతంగా వెనుకబడిన ఉన్నత సమాజం.

The Problems of a Pathetically Backward Society అనే డీజనరేషన్ మీదొక రీజనబుల్ లెక్చర్ దంచడానిక్కాదు, ఇదంతా.

అస్సలు ఏమాత్రమూ మంచీ మర్యాదా, సిగ్గూ శరమూ లేని ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆమె అమెరికన్. బాగా చదువుకున్నావిడ. ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చేసింది. గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నావిడ.

బొమ్మలు వేయడానికి ఆమె సబ్జెక్టు – పురుషాంగం.

Judith Bernstein with her 'Fun Gun' paintin
Judith Bernstein with her ‘Fun Gun’ paintin

చాలా సంవత్సరాలుగా ఆమె పురుషాంగం బొమ్మలు వేస్తూనే ఉంది. ఇప్పటికి ఒక ఐదు వందల phallus paintings వేసింది. రకరకాల పురుషాంగాలు – పెద్దవీ, చిన్నవీ, లేచి ఉన్నవీ, వెంట్రుకలతో ఉన్నవీ, దాడి చేయడానికి అన్నట్టుగా బిర్రబిగుసుకున్నవీ – ఎన్నో మేడ్రాలు!

సాధారణంగా ఇలాంటి ఆడవాళ్లని మనలాంటి వేదభూమిలో బరితెగించిన ముండ అంటారు. సిగ్గూ శరం, చీమూ నెత్తురూ లేని బజార్లంజ అంటారు. పడేసి దెంగితే గానీ దీనికి బుద్ధి రాదనీ
రాక్షస లైంగిక వాంఛతో రెచ్చిపోతారు.

కష్టంగా ఉందా?
గజ్జల్లో నొప్పి గా అనిపిస్తోందా?

Yes. మీ సున్నితమైన మనోభావాల్ని నేను గాయపరచ దలుచుకున్నాను.
పాలరాతితో కట్టుకున్న మీ పవిత్ర మనో మందిరాల్ని గునపాలతో పొడిచి పొడిచి కూలగొట్ట దలుచుకున్నాను. నడిరోడ్డు మీద మీ ప్యాంట్లు విప్పి, మీ రహస్య అంగాల మీద నల్లని ఇంకు పోయదల్చుకున్నాను.
MY NAME IS PROTEST.

***

TO HELL WITH YOUR DICK అని ‘ నానాయాగీ ‘ చేస్తూ గత 50 సంవత్సరాలుగా పెయింటింగ్ లు వేస్తున్న ఆ అమెరికన్ ఆర్టిస్ట్ పేరు JUDITH BERNSTEIN.

ఆమె మారుపేరు మహాస్వప్న!
ఇంటిపేరు జ్వాలాముఖి!!
తండ్రి పేరు నగ్నముని!!!
మన దిగంబర కవులు తెగించి రాయడమూ, ఆమె అక్కడ PHALLUS పెయింటింగ్ లు వేయడమూ ‘ 60వ దశకం’ లోనే మొదలయింది.

మన ఇస్మత్ చుగ్తాయ్ కీ, కమలాదాస్ కీ
నిజమైన వారసురాలు బెర్న్ స్టీన్.

1942 అక్టోబర్ 14న ఆమె న్యూ యార్క్ లో జన్మించింది. ఇప్పుడు ఆమెకి 77 ఏళ్ళు.
ఫైర్ బ్రాడ్ ఫెమినిస్ట్ పెయింటర్.

PENIS అంటే హజం. దౌర్జన్యం. దురాక్రమణ. స్త్రీ ని బెదిరించి, భయపెట్టడానికి మగాడు వాడే ఆయుధం PHALLUS. అదే ఆమె METAPHOR.
నియంత హిట్లర్ ని చార్లీ చాప్లిన్ హేళన చేసినట్టుగానే ఈమె డోనాల్డ్ ట్రంప్ ని
గ్రేట్ DICK’టేటర్ అని పడీపడీ నవ్వుతోంది.

ఈమధ్యనే అమెరికాలో ఆమె పురుషాంగాల
పుస్తకం విడుదల అయింది. మనకది అమర్యాదకరమూ, షాక్, సంచలనం గానీ
అమెరికన్ లకి ఆమె బాగా తెలుసు.

బెర్న్ స్టీన్ extremist ఫెమినిస్టు. మగ దురహంకారానికి ప్రతీకగా మగవాడి మొడ్డని వాడింది. ఆమె పుస్తకం పేరు DICKS OF DEATH.

‘ మృత్యు మేఢ్రాలు ‘ అనొచ్చా?

మగవాడి బలుపునీ, సెక్స్ అనేది వాడికి Pleasure – ఆడదానికి శిక్ష .. అనుకునే పొగరుబోత్తనాన్ని ఆమె తిప్పికొట్టింది. కళాత్మకమైన బూటు కాళ్లతో ఎగిరి BALLS మీద తన్నింది.

JUDITH BERNSTEIN’S LATEST BOOK
IS A PINNACLE OF PROTEST.

*** *** ***

ఇదంతా అత్యాధునికమైన, పరిణితి చెందిన అమెరికన్ గొడవ అనే అనుకుందాం. మరి, మనలాంటి వెనకబడిన, పురాతన పవిత్రమైన పతివ్రతలకు వాసికెక్కిన భారతీయ సనాతన సమాజంలో బరితెగించిన బెర్న్ స్టీన్ చెల్లెళ్ల లాంటి వాళ్ళున్నారా?
లేకేమీ? ఫెమినిస్టు లకు మనకేం కొదవా?

*** *** ***

1984లో కవయిత్రి సావిత్రి ‘ బందిపోట్లు ‘ కవిత:

పాఠం వొప్పజెప్పకపోతే పెళ్లి చేస్తానని
పంతులుగారన్నప్పుడే భయమేసింది
ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమొచ్చినా సెలవివ్వడని
అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది

వాడికేం మగమహారాజని
ఆడామగా వాగినప్పుడే అర్థమైపోయింది
పెళ్ళంటే పెద్ద శిక్ష అని!
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని!

*** *** ***

విమల ‘ సౌందర్యాత్మక హింస ‘ :

మనమంటే 34′ 24, 35 కొలతలైన చోట
మొటిమలు మొలవడం, జుట్టు రాలడం
నడుం సన్నగా లేకపోవడమే మన నిరంతర ఆందోళనకరణ అయిన చోట
ఎంత హింస అనుభవిస్తున్నామో కదా!

*** *** ***

మందరపు హైమవతి ‘సర్పపరిష్వంగం’ గుర్తుందా?

… కామంతో నైతేనేమి, మోహంతో నైతేనేమి
ఇరువురి తనువులొకటైనాక, అద్వైత సిద్ధి పొందినాక
ఈ లోకాన్నే మరచిపోయిన అమృతఘడియల్లో …
“జీతమెప్పుడిస్తారు?”
వేశ్య కూడా ఆ సమయంలో ఆ ప్రసక్తి తేదు
పశువైనా ప్రవర్తించదు మరోవిధంగా …

*** *** ***

పసుపులేటి గీత ఏనాడో రాశారు.

శరీరమొక చారిత్రక తప్పిదమైపోయింది
రెండు పెదవులు, రెండు చెక్కిళ్లు, రెండు రొమ్ములు
రెండు తొడలు, రెండంకెల అందాలు
పక్కనున్న ప్రతివాడూ తొడల మధ్య బర్లేన్ని
మోసుకు తిరుగుతున్నట్టే వుంది

*** *** ***

ఎన్ని వేల వీర్యవర్షాల్ని భరించిందో .. అని ఎఫెక్టివ్ గా చెప్పిన ఘంటసాల నిర్మల ‘ కాల్ గర్ల్స్ మొనోలాగ్ ‘ని ఎలా మర్చిపోగలం?
*
లాగిపెట్టి కొట్టినట్టు పాటిబండ్ల రజని రాసిన ‘ అబార్షన్ స్టేట్మెంట్ ‘ –
*
జయప్రభ ‘ చూపులు ‘ :

రెండు కళ్ల నించి చూపులు సూదుల్లా వచ్చి
మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి …
ఆ చూపుల్లో ఎప్పుడూ ఒకటే సంకేతం ఉంటుంది
చొంగకార్చే కుక్కలాంటి ఆకలుంటుంది …

*** *** ***

కొండేపూడి నిర్మల ‘ లేబర్ రూమ్ ‘
తుర్లపాటి రాజేశ్వరి ‘ తాళిగట్టిన మృగం ‘
జయప్రభ ‘ పైటని తగలెయ్యాలి ‘
1993లో వచ్చిన నీలిమేఘాలు స్త్రీవాద కవిత్వం నిరసన నల్ల జెండాలు ఎగరేశాయి.

కుప్పిలి పద్మ, శిలాలోలిత, వకుళాభరణం లలిత, రత్నమాల, వసంత కన్నాబిరాన్, వోల్గా, శివలెంక రాజేశ్వరీదేవి, కె. గీత, రజియా బేగం, రేవతీదేవి, ఊర్మిళ, అబ్బూరి ఛాయాదేవి, ఏలూరి పార్వతి, అంజన, ఎస్ జయ, వాణీరంగారావు, కే వరలక్ష్మి, పుట్ల హేమలత, మహె జబీన్, రావులపల్లి సునీత, కొండపల్లి కోటేశ్వరమ్మ, సుధ, బి పద్మావతి, జగధాత్రి .. ఇలా ఎంతోమంది మేల్ షోవనిస్ట్ పిగ్స్ పై తిరుగుబాటు కవిత్వం రాశారు.

*** *** ***

సైమన్ దిబోవా – Second Sex

వర్జీనియా వుల్ఫ్ – A Room of Ones Own

కేట్ మిల్లెట్ – సెక్సువల్ పాలిటిక్స్

ఈ ప్రసిద్ధ గ్రంథాలు అందరికీ తెలిసినవే

*** *** ***

PENIS Paintings తో వాసికెక్కిన జుడిత్ బెర్న్ స్టీన్ నేటి మన ముఖ్య అతిథి.

సెక్సిజం, యుద్ధం… మరీ ముఖ్యంగా అమెరికన్ సొసైటీ బలుపు, సకల అణచివేతలపై ఎదురుతిరిగి, నిలబడి గత 50 ఏళ్లుగా అవే పెయింటింగ్స్ వేస్తున్నారామె. అమెరికా ఫెమినిస్ట్ ఉద్యమానికి ఈ కళాకారిణి VANGUARD గా నిలిచి పోరాడుతున్నారు.

1966లో అలబామా గవర్నర్ జార్జి వాలెస్ ఇలా వాగాడు. ” SEGREGATION NOW , SEGREGATION TOMMORROW and SEGREGATION FOREVER “

HE WAS A RACIST, REACTIONARY, AND
A REAL DICK అని అరిచి చెప్పింది జుడిత్. అప్పుడే COCKMAN అంటూ పెయింటింగ్లు వేసింది. నాటి నుంచి ఆమె మగాడి పొగరుబోత్తనానికి సింబల్ గా, PENIS, PHALLUS, DICK అని వికృతంగా చిత్రిస్తూ మగజాతిని తెగనాడింది.
PENIS ని తుపాకులతో పోలుస్తూ, THE FUN GUN (1967), SHOOTERS (2010), DOUBLE HEADER (1976) – అంటే ఒక పురుషాంగానికి రెండు తలలు ఉంటాయి – పెయింటింగులు వేసింది.

T.Prakash

యుద్ధానికి ఆమె బద్ధ వ్యతిరేకి.
1960వ దశకంలో అమెరికా వియత్నాం మీద బాంబులు కురిపిస్తున్నపుడు పురుషాంగాలు అమెరికా జాతీయ జెండాలు కప్పుకుని ఉన్నట్టు బొమ్మలు వేసింది. అంత అరాచకపు అమెరికానీ జుడిత్ షాక్ చేశారు.

ఆ పురుషాంగాల్ని FUCK VIETNAM, UNION JACK-OFF అనే పదాలతో అలంకరించారు.

‘COCKMAN’ పేరుతో బెర్న్ స్టీన్ వేసిన పెయింటింగ్లు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. “SOURCE OF INSPIRATION FOR COCKMAN: THE ELEPHANT – SIZED MALE EGO THAT RAISES TO THE TOP, NO MATTER THE CONSEQUENCE” అన్నారామె.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికవడాన్ని
THE RETURN OF THE COCKMAN
అని ధైర్యంగా అన్నారు బెర్న్ స్టీన్.

“TRUMP HAS BROUGHT OUT THE WORST IN OUR COUNTRY AND IN DOING SO, REMINDED US ALL (ESPECIALLY WOMEN): WE HAVE TO FIGHT” అని జుడిత్ బెర్న్ స్టీన్ అమెరికా మహిళలందరికీ ఒక CLARION CALL ఇచ్చారు.

Dedicated to…

హత్రాస్ చదువుల తల్లి ‘భారతి’ కీ
కొన ఊపిరి దాకా పోరాడిన ఢిల్లీ ‘నిర్భయ’ కీ
హైదరాబాద్ లో రేప్,హత్యతో కాలిపోయిన ‘దిశ’ కీ
ప్రతిరోజూ అత్యాచారాలతో దహించిపోతున్న భారతీయ స్త్రీమూర్తులందరికీ ఈ చిన్ని వ్యాసం – అంకితం – కన్నీళ్లతో…

– TAADI PRAKASH 9704541559

Judith Bernstein with her ‘Fun Gun’ painting

Share.

Leave A Reply