ఉన్నత విద్యలో ముందుకు దూసుకు పోయే ‘ స్టార్స్‌’

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉన్నత విద్యలో ముందుకు దూసుకు పోయే ‘ స్టార్స్‌’

మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ ‘ స్టార్‌30 ‘ కి రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని జనాభాలో 3177940 మంది గిరిజనులే. విద్యతోనే గిరిజన బతుకులు మారతాయని భావించిన ఆయన బతుకు తెరువునిచ్చే ఉన్నత విద్యను గిరిజనులకు పంచడానికి పూనుకున్నారు.
పొలం పనులు,పశువుల పెంపకం లో తల మునకలయ్యే అడవి బిడ్డలకు చదువు పై అవగాహన తక్కువే… తెలంగాణ ప్రభుత్వం వీరి జీవితాలను మార్చే ప్రయత్నం మొదలు పెట్టింది. గిరిజన విద్యార్థుల్లో వెనకబాటు తనాన్ని గుర్తించిన ఉట్నూరు ఐటిడిఏ ప్రాజెక్టుఆఫీసర్‌ ఆర్వీ కర్ణన్‌ ( కలెక్టర్ ,మంచిర్యాల)ఒక నూతన ప్రయత్నం చేశారు.
ఇతర విద్యార్థులతో ధీటుగా గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు దూసుకు పోయేలా‘ స్టార్‌30 ‘ ని రూపకల్పన చేసి చదువులో చైతన్యం పెంచారు… ఆలోచనలో ఆదర్శం ఉంటే ఫలితం విజయం వైపే అని ఈ ప్రాజెక్టు నిరూపించింది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం వల్ల వందలాది గిరిజన విద్యార్ధులు ఉన్నత విద్యలో మెరికల్లా తయారయ్యారు…

Share.

Leave A Reply