బొంగులో ‘కల్లు’ తిరిగే నిజాలు…

Google+ Pinterest LinkedIn Tumblr +

బొంగులో చికెన్‌ అరకులో దొరికితే, భద్రాద్రి కొత్తగూడెంలో బొంగులో కల్లు దొరుకుతోంది. ఇక్కడ చెట్లకు ముంతల స్ధానంలో వెదురు బొంగులు కట్టి కల్లు పడుతున్నారు. ఒక్కో బొంగులో రెండు నుండి మూడు లీటర్ల కల్లు వస్తోంది. అన్ని సీజన్లలో ఈ వెదురు కల్లు కొత్త రుచిలో దొరకడంతో కల్లు బాబులు ఈ గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు. వెదురు బొంగుల్లోని కల్లు త్వరగా పులిసి పోవడం లేదని సహజమైన రుచి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు.ఐతే ఈ కల్లు తాగడం వెనుక ఒక ఆరోగ్యరహస్యం ఉందని తెలిసింది. మా పరిశీలనలో తెలిసింది. 
వెదురు బొంగులో పట్టిన కల్లులో కిడ్నీ వ్యాధులను తగ్గించే లక్షణాలు ఉన్నాయా ?అనే దిశగా గత ఏడాది కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అని పలువురు సైంటిస్టులను సంప్ర దించగా మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ భూక్యా భీమా స్పందించారు. 
కల్లు క్యాన్సర్‌ని నయం చేస్తుందా ? 
ఉదయం పూట తాజాగా తాటి చెట్టునుండి తీసిన కల్లు తాగితే అందులోని ఓ సూక్ష్మజీవి మానవుడి కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని,దీంతో పాటు కిడ్నీ వ్యాధికారక సూక్ష్మ జీవులను ఈ జీవి నాశనం చేస్తుందని గుర్తించినట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం సూక్ష్మజీవ శాస్త్రం విభాగం ప్రొఫెసర్‌ భూక్యా భీమా అంటున్నారు. 
ఏడాది పాటు ఖమ్మం,వరంగల్‌ తదితర ప్రాంతాల్లో 50 రకాల తాటి కల్లు నమూనాలు సేకరించి, పరిశోధన చేశారు.ఫలితంగా 18రకాల సూక్ష్మజీవులు మనిషిలోని రోగకారక సూక్ష్మజీవులను చంపుతున్నట్టు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ ద్రువీకరించిందని భూక్యా భీమా చెప్పారు. 
జీర్ణ వ్యవస్ధలోని,సహజ సిద్ద సూక్ష్మజీవులతో సహజీవనం చేయడం,వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించడం,ప్రతి కూల పరిస్ధితులను తట్టుకోవడం వంటి లక్షణాలు తాటి కల్లులో గుర్తించిన సూక్ష్మజీవుల్లో ఉన్నాయి. 
కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందా ? 
” వెదురు బొంగులో కల్లు మరింత తాజాగా ఉండే అవకాశం ఉంది. ఐతే కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి తాటి కల్లుకు ఉందా? అనే అంశం పై తాజాగా మా పరిశోధన పూర్తయింది. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి.” అని భూక్యా భీమా మాతో ధీమాగా చెప్పారు. 
కల్లు తీశాక కొన్ని గంటలు నిలువ ఉంటే పులిసి ఆల్క్‌హాలుగా మారుతుంది.ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, తాజాగా తీసిన కల్లు రెండు గంటల లోపు తాగితేనే, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అంటారు ఈ ప్రొఫెసర్‌. 
pic/ruralmedia team

Share.

Leave A Reply