శ్రమలో తీయదనం

Google+ Pinterest LinkedIn Tumblr +

వీరు 3 ఎకరాల్లో చెరకును కెమికల్స్‌ వాడకుండా, సేంద్రియ పద్దతిలో పండించారు.

ఎదిగిన పంటను వారే కోసుకొచ్చి, సొంతంగా ఆర్గానిక్‌ బెల్లం తయారు చేస్తున్నారు. ఈ పండుగ సీజన్‌లో అరిసెలకు ఈ బెల్లమే బెటరంటారు ఇక్కడి గ్రామస్తులు. ‘మీలా తిరిగే వారు ఈ బెల్లం ముక్కలు చప్పరిస్తే మా శ్రమలో తీయదనం తెలుస్తుందని ‘ మాకు సలహా ఇవ్వడమేకాక ఒక బెల్లం ముద్ద చేతిలో పెట్టారు ఈ రైతమ్మలు. 
చిత్తూరు జిల్లాలోని చినగొట్టిగల్లు మండలంలో ఉండే ఓ మారుమూల పంచాయతీ కోటబయలులో మాకు కనిపించిన దృశ్యమిది. 
నేడు ఈ పల్లె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచింది. 

Share.

Leave A Reply