అమెరికా దొరసాని ఫిదా…

Google+ Pinterest LinkedIn Tumblr +

అమెరికా దొరసాని ఫిదా కావాల్సిందే..
” నేను గతంలో పండించిన కందిపంట వేరు.. ఇప్పుడు పండిస్తున్న కందుల రుచి వేరు” అంటోంది… జహీరాబాద్‌ మండలం ఖాసింపూర్‌ గ్రామానికి చెందిన శోభమ్మ.
గ్రామ పంచాయితీ కార్యాలయం నుంచి అర కిలోమీటర్‌ దూరంలో ఒక చిన్న వాగు దాటిన తర్వాత శోభమ్మ పొలంలో అడుగుపెట్టింది ‘రూరల్‌మీడియా’.
కాయదశలో ఉన్న కంది పొలాన్ని సంతప్తిగా చూస్తున్న ఆమెను పలకరించినప్పుడు… ”గతంలో నేను కంది పంటని రసాయనాలతోనే పండించేదానిని. ఇప్పుడు ఆర్గానిక్‌ పద్దతిలో విత్తనాల దశ నుండే జాగ్రత్తలు తీసుకొని, వేప కషాయాలతో సాగు చేస్తూ, సుభాష్‌ పాలేకర్‌ బాటలో నడుస్తున్నా. ప్రకతి వ్యవసాయం వల్ల రసాయనిక ఎరువులు, పురుగుమందులకు దూరంగా ఉన్నాం. ఆరోగ్యకరమైన పంటను పండిస్తున్నాం. గతంలో రసాయనాలతో పండించిన కందులకంటే కంటే ఇప్పుడు పండిస్తున్న కందిపప్పు త్వరగా ఉడుకుతూ, ఎక్కువ రుచిగా వుంటోంది. హైదరాబాద్‌ వచ్చిన అమెరికా దొరసాని మా కందిపప్పు రుచి చూస్తే వదలదు’అని పసుపు పచ్చని కంది పూల మధ్య నవ్వుతూ, చెప్పింది ఆమె.

Share.

Leave A Reply