వన్‌ లైట్‌, వన్‌ లైఫ్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

” దేశంలో విద్యుత్‌ లేని పల్లెలంటూ ఇక ఉండవు,1000 రోజుల్లో చీకటిని తరిమేస్తా ” 2015లో స్వాంత్రదినోత్సవం నాడు మన ప్రధాన మంత్రిగారు ఇచ్చిన హామీ ఇది. కానీ, ఇప్పటికీ మన దేశంలో 18,452 పల్లెలు కరెంట్‌ లేక చీకటిలో మగ్గుతున్నాయి. వాటిలో రెండు గ్రామాల కత ఇది.
చీకటి అనేది ఊహకు అందని అతి పెద్ద సామాజిక సమస్య… గుడ్డిదీపాల్లో చమురు కోసం… కాయకష్టంతో సంపాదించిన దాన్లో కొంత కిరోసిన్‌ కోసమే ఖర్చయితే ఇక బతికేదెలా? కిరోసిన్‌ కొనడానికి కిలోమీటర్లు కొండా కోనలు నడిచివెళ్లి నెత్తిమీద మోసుకుంటూ తెచ్చుకోవాలి. ఇంత కష్టపడి దీపాలు వెలిగించుకున్నా, ఈదురు గాలులకు ఎపుడు ఆరిపోతాయో తెలీదు. ఇలాంటి రెండు గ్రామాల్లో రూరల్‌ మీడియా అడుగు పెట్టింది.

1. వనం పల్లి తండా (జరాసంగం మండలం,మెదక్‌ జిల్లా ,తెలంగాణ)

2, మాధవరం.( తవణంపల్లి మండలం,చిత్తూరు జిల్లా ,ఆంధ్రా ).

ఈ రెండు గ్రామాలు కలిపి 180 కుటుంబాలుంటాయి. వీరికి వెలుగులు పంచాలి.

కనీసం ఇంటికో సోలార్‌ లైట్‌ ఇస్తే, వంట పనిచేసుకోవడానికి, పిల్లల చదువుకు, గేదెపాలు తీసుకోవడానికి, పొలం వైపు పోయిరావడానికి, సంతలో కూరగాయలు అమ్ముకోవడానికి,ఈ వెలుగులు ఉపయోగపడతాయి. మీరు సోలార్‌ దీపాలే ఇస్తారో ఆర్దికంగా ఆదుకుంటారో మీ ఇష్టం … వారికి చీకటి నుండి విముక్తిని ప్రసాదించండి. కొన్ని గంటలు వెలిగే సౌరదీపాల వల్ల వీరి జీవన ప్రమాణాలే మారిపోతాయి. రండి వారి బతుకులో వెలుగులు నింపండి…

Life has been a little better since then for the villagers. It can become even better if we help them get solar operated street lights too, until the government reaches them with electricity. A contribution from you can help bring some light to the dark lives and homes of the villagers of Madavaram,Vanampalli

Contact – ruralmedia30@gmail.com  

Share.

Leave A Reply