యాచకుడిగా మారిన పాత్రికేయుడు

Google+ Pinterest LinkedIn Tumblr +

అవును. వార్తలు రాయాల్సిన విలేకరి యాచకుడిగా మారాడు. రేపటి పౌరులకు మెరుగైన విద్య అందించడానికి భిక్షాటన చేస్తున్నాడు…
రియాజ్‌కి పేదరికం తెలుసు. ఎందుంటే అక్కడే పుట్టి పెరిగాడు.స్కూల్‌ పుస్తకాల కోసం పైసలు లేక అనేక కష్టాలు పడ్డాడు. చిత్తూరు జిల్లా,వరదయ్యపాలెం గ్రామానికి చెందిన రియాజ్‌ చదువుకోసం తల్లిదండ్రులు పడిన ఆర్ధిక ఇబ్బందులు ఇప్పటికీ అతడిని వెంటాడుతుంటాయి.
రేపటి తరం భవిష్యత్‌కి చదువు ఎంతో కీలకమని తెలుసు. తన లాగా పేద చిన్నారులు బడికి వెళ్లడానికి బాధలు పడకూడదని,వారి చదువు ఆగకుండా తన వంతు సాయం అందించాలనేది జీవితాశయంగా ముందుకు సాగుతున్నాడు. టైలరింగ్‌ వృత్తితో అంతంత మాత్రం రాబడితో బతుకుతున్న అతడు తన ఆశయం సాధన కోసం రైలు పట్టాలెక్కాడు.
చెన్నై నుండి నెల్లూరు వెళ్లే ప్యాసింజర్‌ ట్రైన్‌లో ప్రతీ మంగళవారం భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బుతో పేద పిల్లలకు పుస్తకాలు,పెన్నులు కొని అందిస్తున్నాడు. రియాజ్‌ చేసిన చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాన్నే ఇచ్చింది.పేదరికం వల్ల మధ్యలో చదువుమానేస్తున్న పిల్లలు మళ్లీ బడికి వస్తున్నారు.వారికి అవసరమైన పుస్తకాలు అందటంతో హోం వర్క్‌లు చేస్తూ మంచి మార్కులు సాధిస్తున్నారు.
ఇక్కడితో ఆగకుండా తన మిత్రులతో కలిసి ‘బెటర్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పూర్‌ చిల్డ్రన్‌’ సంస్ధను ఏర్పాటు చేసి తన ఆశయాన్ని మరింత విస్తృతం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. చదువు కోసం తపించే చిన్నారుల భవిష్యత్‌ కోసం చేయి చాస్తున్న ఈ యువకుడికి రైలు ప్రయాణీకులు జేజేలు పలుకుతున్నారు.
రియాజ్‌ టైలరింగ్‌ చేసుకుంటూనే, ఒక ప్రముఖ దిన పత్రికకు విలేకరిగా కూడా పని చేయడం విశేషం. (చిన్నారుల భవిష్యత్‌ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న రియాజ్‌కి సాయం చేయాలనుకుంటున్న వారు సంప్రదించండి… Mr. Riyaz :
+919966907644 shak.riyaz09@gmail.com)

  • Ravindranath .C / rural media
Share.

Leave A Reply