మడ అడవులు మడతై పోతున్నాయా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో మడ అడవులు పెరుగుతాయి. సహజంగా విస్తరించిన ఈ  అడవులు   సముద్రపు కోతనుంచి ఇవి భూమిని రక్షిస్తాయి. తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా  ఉంటాయి.

మడ అ‍డవులు తూ.గో.జిల్లాలో కాకినా‍‍‍‍‍‍డ సమీపం లోని ,తాళ్ళరేవు మండలంలోని కోరంగి నుండి ఐ.పోలవరంకాట్రేనికోనఉప్పలగుప్తంఅల్లవరం,  సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లో ఇవి విస్తారంగా ఉన్నాయి. ఇక్కడే కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ఉంది.

కోరంగి మడ అడవుల ప్రాంతాన్ని(CORINGA WILD LIFE SANCTUARY)  1978లోనే వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 332.66 చదరపు కిలో మీటర్ల మేర మడ అడవులు విస్తరించగా, ఏపీ అటవీ శాఖ లెక్కల ప్రకారం కోరంగి మడ అడవులు 235.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఇవి విస్తీర్ణంలో దేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులుగా పర్యావరణ వేత్తలు అంటారు.

జీవన వైవిధ్యానికి  ఆలంబన

మడ అడవులలో నల్లమడ, తెల్లమడ, ఉప్పుపొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్లా, పొన్న మొదలైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు పెరుగుతున్నాయి. మొసళ్ళు, ఫిషింగ్‌క్యాట్స్‌, నీటి కుక్కలు, డాల్ఫిన్స్‌ వంటి జంతువులతో పాటు 120 రకాల పక్షులు, కీటకాలు  జీవనాన్ని సాగిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి,పచ్చదనానికి ఆవాసాలు…
ఈ  కోరంగి అడవులు .

 ఏది నిజం…?

ఇలాంటి ప్రాంతం లో సుమారు 70వేల మంది మత్స్యకారులు వేట మీద ఆధారపడి ఉన్నారు. ‘’ ఇప్పుడు ప్రభుత్వం  ఇళ్ల స్థలాల పేరుతో సముద్రపు పాయల్ని కప్పిపెడుతున్నారు. వాటిని పూడ్చేస్తే మత్స్యసంపద నాశనం అవుతుంది.  ఇలా చేస్తే మత్స్యకారుల భవిష్యత్ ఏం కావాలి? కాకినాడకు సముద్రపు ముప్పు పొంచి ఉందని, సహజ వనరులను కాపాడాలని…’’  పర్యావరణ వేత్తలు ఆందోళన పడుతుంటే,

“కాకినాడలో  25వేల కుటుంబాలకు ఒకేసారి ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నాం.  కాకినాడ పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన  భూములు 1979 నుంచి  ఖాళీగానే పడి ఉన్నాయి. వాటినే పేదలకు  ఇస్తున్నాము. మడ అడవులకు, పోర్టు భూములకు సంబంధం లేదు. కాకినాడ నగరానికి మడ అడవులు చాలా దూరంగా ఉన్నాయి. ‘’ అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపధ్యం లో మడ అడవికి ఆపద వచ్చిందా ? అని UD  అనే సంస్థ ఒక Videoని Social mediaలో పోస్ట్ చేశారు. ప్రజల అభి ప్రాయాలను visual. చేశారు.https://youtu.be/Y50iXfVOD0k

Share.

Leave A Reply