నాగార్జున సాగర్ పునాదిరాయికి 63 ఏళ్లు

Google+ Pinterest LinkedIn Tumblr +

నాగార్జున సాగర్ పునాదిరాయికి 63 ఏళ్లు

సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు.. నెహ్రూ చెప్పిన ఈ మాట నాగార్జున సాగర్ విషయంలో అక్షరాలా నిజమైంది

ఆకలిని గెలిచేందుకు.. కరువుపై విజయం సాధించడానికి ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన అతి పెద్ద మానవ నిర్మిత రాతి కట్టడం ఈ నాగార్జునసాగర్ సరిగ్గా 63 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా పునాదిరాయి వేసుకున్న ఈ మహా జలాశయం పన్నెండేళ్ల తర్వాత 1967లో నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ చేతుల మీదుగా జాతికి అంకితమైంది. 1974లో క్రస్ట్ గేట్లు అమర్చడం ద్వారా నేటి పూర్తి రూపం సంతరించుకుంది.

కృష్ణానదిపై నిర్మించిన జలాశయాల్లోకెల్లా పెద్దది ఈ నాగార్జున సాగర్యంత్రపరికరాలు పెద్దగా లేని ఆ రోజుల్లో నిర్మించబడిన ఈ ప్రాజెక్టు మానవ శ్రమశక్తి ఓ చక్కటి ఉదాహరణ.నాగార్జున సాగర్ నిర్మాణానికి వేలమంది కూలీలు పని చేశారుదాదాపు పుష్కర కాలం పాటు ఈ మహా నిర్మాణంసాగిందిలక్షల మందికి ఉపాధి కల్పించింది.

నాగార్జున సాగర్ ఆలోచనకు స్వతంత్రానికి పూర్వమే బీజం పడిందినిజాం కాలంలో అప్పటి హైదరాబాద్ రాష్ట్రం సాగుతాగు నీటి కోసం భారీ డ్యామ్ నిర్మించాలని నందికొండ ప్రాంతంలో సర్వే నిర్వహించిందిఇక్కడ ప్రాజెక్టు కడితే ఆంధ్రా రాష్ట్రంలోని భూములు కూడా ముంపునకు గురవుతాయని అధికారులు గుర్తించారుదీంతో ఈ ప్రాజెక్టును హైదరాబాద్– ఆంధ్ర రాష్ట్రాలు కలసి చేపడితే బావుంటుందని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ఇంజినీర్ నవాబ్ అలీజంగ్ సూచించారు.

nagarjunasagar dam@64

1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన

ఈ ప్రతిపాదనకు ఆంధ్ర రాష్ట్రం కూడా అంగీకరించడం.. దాన్ని ప్రధాని నెహ్రూ ముందుకు తీసుకెళ్లడం జరిగాయినెహ్రూ పచ్చజెండా ఊపడంతో నాటి నందికొండనేటి నాగార్జునసాగర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారుఈ ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ప్రభుత్వాలతో పాటు మక్త్యాల రాజా తపన కూడా చాలా ఉందిఆయన ఈ ప్రాజెక్టు వచ్చేందుకు ఎంతో శ్రమపడటంతో పాటు అప్పట్లోనే 52 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

మానవ నిర్మిత మహా నిర్మాణమైన నాగార్జునసాగర్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయిమనుషులు నిర్మించిన అతిపెద్ద రాతి కట్టడం నాగార్జునసాగర్దేశంలోనే రెండో అతి పెద్ద జలాశయం కూడాప్రపంచంలో మూడో అతిపెద్ద జలాశయంసాగర్ ఆనకట్ట మొత్తం పొడవు 1.6 కిలోమీటర్లుసాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులునీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలుబౌద్ధుల కాలం నాటి మహా పండితుడైన నాగార్జునుడు నడయాడిన ప్రాంతంకావడంతో ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ అని నామకరణం చేశారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 21 లక్షలకుపైగా ఎకరాల్లో సాగర్ జలాలు ధాన్య సిరులు పండిస్తున్నాయితెలంగాణలోని నల్గొండసూర్యాపేటఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాగుంటూరు జిల్లాల్లోని కోట్ల మంది తెలుగుప్రజలపాలిట అన్నపూర్ణగా నిలుస్తోంది నాగార్జున సాగర్లక్షల ఎకరాల బీడు భూములను మాగాణులుగా మార్చిన మంత్ర జలసిరి అదిహైదరాబాద్ మహానగరంతో పాటు వందలాది గ్రామాల దాహార్తిని తీరుస్తోందీ జలసాగరంఅంతే కాదు.. నాగార్జునసాగర్ ఒక బహుళార్థక ప్రాజెక్టుసాగుతాగు నీటి అవసరాలనే కాకుండా విద్యుచ్ఛక్తి కూడా అందిస్తోందివేల గ్రామాలుపరిశ్రమలు సాగర్ విద్యుత్ తో వెలుగులీనుతున్నాయిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో సాగర్ జలాలు వినియోగించుకుంటున్నాయి. (pic/credit/ Wikipedia)

please click for video https://youtu.be/PC2IlOFBKK4?t=147

Share.

Leave A Reply