మాలావత్‌ పూర్ణ, మరో సంచలనం!!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిరక్షరాస్యతలో, బడి మానడంలో, పొలం పనుల్లో, ఇంటిపనుల్లో గిరిజన బిడ్డలే ముందుంటారు. అలాంటి చీకటి సమాజం నుండి వచ్చిన వెలుతురు కిరణం మాలావత్‌ పూర్ణ .తెలంగాణ గురుకుల బాస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రోత్సాహంతో ఈ బాలిక ఏకంగా ప్రపంచంలోని 7 ఎత్తయిన శిఖరాల్ని పాదాక్రాంతం చేసుకోవడానికి అడుగులు వేస్తోంది.
తాజాగా ఈ ఏడాది చివరిలో మరో సారి మెరిసింది. ఈ నెల 26న అంటార్కిటికా ఖండంలో ఎత్తయిన విన్సన్‌ మసిఫ్‌ పర్వతాన్ని తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ అధిరోహించింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన పూర్ణ.. ఎవరెస్ట్‌, కిలిమంజారో, ఎల్బ్రస్‌, అకోన్కాగ్వా, కార్ట్స్‌నెజ్‌ పర్వతాల పై పాదం మోపి, ఇపుడు విన్సన్‌ మసిఫ్‌ పర్వతాన్ని అధిరోహించింది. ఇప్పటివరకు మొత్తం ఆరు ఎత్తయిన పర్వతాలను తాకింది. ఇక ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వతాన్ని అధిరోహించడమే లక్ష్యమని పూర్ణ ఈ సందర్భంగా చెబుతోంది.

నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన తనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు పూర్ణ సంతోషంగా చెప్పింది. తనకు సహకారం అందించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు ఆమె క తజ్ఞతలు తెలిపింది.
‘పూర్ణ ప్రపంచ పర్వతారోహకురాలిగా తెలంగాణకు, దేశానికి గర్వకారణం. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది” అని గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆనందం ప్రకటించారు.
పూర్ణ చేసిన ప్రతీ సాహసమూ ఒక సవాలే! క్రికెటర్‌ చేసిన ప్రతీ సెంచరికి ఒక చరిత్ర ఉన్నట్టే, ఈ అమ్మాయి ఎక్కిన ప్రతీ పర్వతానికి ఒక ప్రాధాన్యత ఉంది .

Hi guys!!!
I’m so excited to announce that I’ve successfully completed the Mt.Vinson Expedition✌️. I’ve reached the summit⛰️ on the 26th of December, 2019 💃. I must say that this Expedition has been most challenging of all! Like any mountain, even Vinson has been challenging. But, it’s not the physical aspect I’m talking about. The finances, logistics and preparation tested me to the core!

As always my mentor Mr. Praveen Kumar IPS sir and my coach Mr @bachinepally sir of @transcend adventures were the bigger mountains supporting me. Also, a special mention to a host of people who helped me in the last minute to gather a lot of necessities. A BIG THANK YOU to all of you, without which this summit wouldn’t been possible.

Share.

Leave A Reply