కోతికి ఒక విగ్రహం!!

Google+ Pinterest LinkedIn Tumblr +

మట్టిలో బతికే పల్లె ప్రజలకు ఏమీ తెలీదని, పుస్తకాల్లో చదివిన నాలుగు ముక్కలతో వారిని ఎడ్యుకేట్‌ చేసి,ఫేస్‌బుక్‌లో రెండు ఫొటోలు పెట్టి లైకులు కొట్టించుకుందామని, కరీంనగర్‌ పక్కనే ఉన్న సుందరగిరికి వెళ్లాం. చౌరస్తాలో నాయకుల విగ్రహాల బదులు, ఒక కోతికి శిలావిగ్రహం పెట్టి భక్తితో దండం పెట్టుకుంటున్న జనులు కనిపించారు.
ఒకపుడు ఆ కోతి ఇంటింటికీ తిరిగి, అందరినీ పలకరిస్తూ, పిల్లలతో ఆడుకునేదట. అసలు కోతుల వల్లే ఐకమత్యంగా ఉండటం తెలిసిందని గ్రామస్తులు చెప్పారు.

కూరగాయలను నేలమీద కాకుండా ఆకాశంలో పండిస్తూ అధిరపోయే ఆదాయం పొందుతూ పల్లెను ఆకుపచ్చగా మార్చి కోతులకు స్వాగతం పలుకుతున్నారు…

ప్రజలకు ఏమాత్రం పనికిరాని రాజకీయనాయకుల కంటే , పర్యావరణాన్ని కాపాడే జంతువులే బెటర్‌ అని ఈ ప్రజలు తమ భక్తిని చాటుతున్నారు.

భక్తితో ఊగిపోకుండా , భుక్తిని కూడా, సాధించిన ఆ ప్రజలు మాకు జ్నానాన్ని,వెలుగును ప్రసాదించారు. pic/Rameshbabu/Ruralmedia.

Share.

Leave A Reply