దేశంలో తయారయ్యే 10 ఫోన్లలో 3 ఇక్కడే…

Google+ Pinterest LinkedIn Tumblr +

15 వేల మందికి ఉపాధి

” నేను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ శ్రీసిటీలోని ఫాక్సకాన్‌ పరిశ్రమ. ఇక్కడ 15 వేల మంది పనిచేస్తున్నారు.వీరిలో 85 శాతం మంది మహిళలున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మహిళలకు ఉపాధి కల్పించిన ఘనత శ్రీసిటీకే దక్కుతుంది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల నుంచి మా అక్కచెల్లెలందరు సెల్‌ ఫోన్లు తయారు చేస్తూ, ఫాక్సకాన్‌ పరిశ్రమలో నాకు కనిపించడం చాలా సంతోషంగా వుంది. ఎన్నో రాష్ట్రాలు పోటీపడితే మా మాట నమ్మి ఫాక్సకాన్‌ ఎండీ జోష్‌ ఫోల్గర్‌ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసి,అద్భుతంగా అభివద్ధిని సాధించారు. దేశంలో తయారయ్యే ప్రతి పది ఫోన్లలో 3 ఫోన్లు ఇక్కడి గ్రామీణ మహిళల చేతుల్లో తయారవడం విశేషం. దేశ వ్యాప్తంగా 10 లక్షలు ఉద్యోగాలు కల్పనగా ఫాక్సకాన్‌ పలు ప్రాంతాలలో ప్లాంటులు ఏర్పాటు చేయబోతోంది.

AP MINISTER NARA LOKESH VISITS SRI CITY

AP MINISTER NARA LOKESH VISITS SRI CITY

అయితే  ఆంధ్ర రాష్ట్రంలోనే మరిన్ని యూనిట్లు పెట్టాలని నేను కోరుతున్నాను. పరిశ్రమల పరంగా ఫాక్సకాన్‌ విజయగాధనే నేను అందరకి చెబుతుంటాను…” అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారాలోకేష్‌ . ఆదివారం చిత్తూరు జిల్లా, సత్యవేడులోని శ్రీసిటీ పారిశ్రామిక పార్క్‌లో ఫాక్సకాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ని సందర్శించారు.
సామాజిక అనుకూల వాతావరణం 

ruralmedia-Minister Nara Lokesh visits Sricity

Minister Nara Lokesh visits Sricity

పరిశ్రమలు తేవడంతో పాటు అవి అభివద్ధి చెందేందుకు అనువైన సామాజిక వాతావరణం కల్పిస్తూ, తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానం, డైనమిక్‌ పనితీరుకు తోడుగా కష్టపడే పనిచేసే మంత్రులు, కలెక్టర్లు, సిబ్బంది సహకారంతో రాష్ట్రం పారిశ్రామికంగా ముందంజలో దూసుకెళుతోందని లోకేష్‌ అన్నారు.
శ్రీసిటీలో మినీ జపాన్‌… 
దేశంలోనే విజయవంతమైన పారిశ్రామికవాడగా శ్రీసిటీ విజయం సాధించింది. వందకు పైగా పరిశ్రమలతో 45 వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. లక్ష ఉద్యోగాల లక్ష్యంగా అడుగులు వేస్తోంది. జపాన్‌, చైనా పరిశ్రమలతో శ్రీసిటీ ఒక మినీ జపాన్‌, చైనాలా తయారవుతోంది అన్నారు. శ్రీసిటీ ఎండీ రవీంధ్రసన్నారెడ్డి కృషీ,పట్టుదల అమోఘం అని లోకేష్‌ ప్రశంసించారు.
ఫాక్సకాన్‌ పరిశ్రమ సందర్శనలో భాగంగా మంత్రి నారాలోకేష్‌ అక్కడ పనిచేసే 13 జిల్లాలకు చెందిన 1500 మంది మహిళా ఉద్యోగులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం శ్రీసిటీ లోని ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.
స్వాగతించిన శ్రీసిటీ చైర్మన్‌, ఎండీ… 
మంత్రి శ్రీసిటీరాక సందర్భంగా శ్రీసిటీ చైర్మన్‌ శ్రీనిరాజు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, ” ఫాక్సకాన్‌ లాంటి గొప్ప పరిశ్రమను ఇక్కడకు తీసుకొచ్చిన ఘనత మంత్రి లోకేష్‌ కు దక్కుతుంది. ప్రభుత్వ సహకారంతో మరిన్ని పరిశ్రమలు శ్రీసిటీకి తరలిరానున్నాయి, వేలాది మందికి ఉపాధి కలుగుతుంది.” అన్నారు.

Share.

Leave A Reply