హైదరాబాద్‌లో, మరో శిల్పారామం

Google+ Pinterest LinkedIn Tumblr +

పంటలు పండని, బంజరు భూమిలో అందమైన శిల్పారామం రూపుదిద్దుకుంది. రాళ్లు రప్పల రంగురంగుల వేదిక ఏర్పడింది. 
హైదరాబాద్‌ ప్రజలకు , గ్రామీణ వాతావరణాన్ని, తెలంగాణ సంస్కతీ, సంప్రదాయాలను పరిచయం చేస్తున్న మాదాపూర్‌లోని శిల్పారామం తరహాలోనే మరొక సుందర రామం, శివారు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఉప్పల్‌ పమీపంలో మినీ శిల్పారామం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2018లో మున్సిపల్‌ డెవలప్‌ మెంట్‌ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ కళా వేదికకు పునాది పడింది. మరి కొన్ని రోజుల్లో మినీ శిల్పారామాన్ని ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. ఉప్పల్‌-నాగోల్‌ ప్రధాన రహదారికి సమీపంలో, నాగోల్‌ మెట్రో రైలు డిపో దగ్గర, మూసీనది తీరంలో మినీ శిల్పారామాన్ని నిర్మించారు. 

New Shilparamam,Uppal      


9.5 ఎకరాల్లో…. 
ఆధునిక నగరంలో గ్రామీణ వాతావరణం ఈ శిల్పారామం ప్రత్యేకత. ఇప్పటి వరకు ఒక్క చోటుకే పరిమితమైన శిల్పారామం సంస్క తిని మరోచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌, మూసీ నదిని అనుకొని ప్రాంతంలో హైదరాబాద్‌ మహానగరాభివ ద్ధి సంస్థకు చెందిన 9.5 ఎకరాలను శిల్పారామానికి కేటాయించారు. 
శిల్పారామం నిర్మాణానికి హెచ్‌ఎండీఏ రూ.10కోట్లతో పనులు చేసేందుకు ప్రతిపాదనలు చేసింది. ఈ పనులను టూరిజం శాఖ ఆధ్వర్యంలో మొదలై పూర్తయి తుది మెరుగులు దిద్దుకొంటోంది. 
హైటెక్‌ సిటీ లోని శిల్పారామానికి ఉన్న ప్రధాన ఆర్చి తరహాలో ఉప్పల్‌ శిల్పారామానికి ఏర్పాటు చేస్తున్నారు. 

New Shilparamam@Uppal


ఆహ్లాద పరిచే పల్లె వాతావరణం 
హస్తకళల కోసం స్టాళ్లు, మినీ వేదికలు, పల్లె వాతావరణం తలపించేలా నిర్మాణాలను, ల్యాం డ్‌స్కేపింగ్‌ చేపట్టి ఆకర్షణీయం గా మార్చారు. 
ఇక్కడ నిర్మించే ప్రతీ స్టాల్‌ గ్రామీణ నేపథ్యాన్ని, గ్రామీణ కళలు, సంస్కతులు కళాకారులను ప్రోత్సహించే విధంగా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేనేత వస్తువులు, అరుదైన సంప్రదాయ కళాత్మక వస్తువులు అమ్మకానికి, ఇక్కడ 40 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. అరుదైన రుచులతో క్యాంటీన్‌ కూడా ఉంది. 
ఈ శిల్పారామం పక్కనే మూసీనది ఉండటం వల్ల దుర్గంధం రాకుండా ప్రత్యేకమైన మొక్కలను పెంచుతున్నారు. 9.5ఎకరాల స్థలంలో ల్యాండ్‌స్కేపలను ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది కూర్చునేందుకు అనువుగా ప్రత్యేకమైన ఓపెన్‌ థియేటర్‌ నిర్మించారు. 
అందుబాటులో మెట్రో రైలు 
సమీపం లోనే మెట్రో రైలు డిపో, నాగోల్‌ మెట్రోస్టేషన్‌, ఇన్నర్‌ రింగు రోడ్డు ఉండడంతో మినీ శిల్పారామం నిర్మాణాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒకప్పుడు గడ్డి భూ ములుగా ఉన్న ఉప్పల్‌ భగాయత్‌ ప్రాంతంలో అభివ ద్ధి కార్యక్రమాల పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. మూసీ వెంట ఉండే గడ్డి భూముల దశ మొత్తం మారిపోతోందని, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పుడు ఉప్పల్‌ భగాయత్‌ ప్రాంత వాసులు అంటున్నారు. 
హైదరాబాద్‌లో, రెండో శిల్పారామం: 
గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని శిల్పారామం సేవలను తూర్పు విభాగానికి విస్తరించేందుకు ఉప్పల్‌ లో రెండో శిల్పారామం నిర్మించినట్లు శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌ రావు అన్నారు.
శనివారం(22.6.2019)  ప్రారంభించ బోతున్నారు.  Pics By.K.Rameshbabu 

Share.

Leave A Reply