జెర్సీ : ఓ బలమైన సంకల్పం

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచం విజేతల కోసమే చూస్తుంది. విజేతల గురించి వెతికి మరీ తెలుసుకోవానుకుంటుంది. విజేతలను అనుసరించిన పిల్లలకి చెబుతుంది. విజేతల ప్రపంచ నిర్మాతలని చరిత్రని వక్రీకరిస్తుంది. జెర్సీ విజేత జీవితం కాదు.. విజేత కావలనుకుని అందుకోసం ప్రయాసపడ్డ వ్యక్తి కథ.. బలమైన సంకల్పంతో ముందుకెళితే ఎవరూ మనల్ని ఆపలేరని చెప్పే ఓ స్పోర్ట్స్ మెన్ కథ. అందరినీ జీవితం ఒక్కలాగే కరుణించదు. జీవితంలో అన్నీ సమృద్ధిగా కూడా లభించవు. ఏవైతే జీవితానికి సంపూర్ణతనిచ్చి కాపాడుతాయనుకుంటామో జీవితం దాన్నే మనకందకుండా దాచేస్తుంది. ఒక రకంగా జీవితం అంటేనే ఒక్కోసారి కోల్పోతున్న వాటి కూడికలు లెక్క అన్నట్టు ఉంటుంది. జెర్సీలో అర్జున్ కారెక్టర్ ఓ కోల్పోయిన మనిషి కథ. పదేళ్ల కాలంలో తనని తాను , తను అమితంగా ప్రేమించే క్రికెట్నీ, తన కోసం ఇళ్ళు వదిలొచ్చిన ప్రేమించిన అమ్మాయికి ఏమీ ఇవ్వలేని అసహాయతనీ, చేతకానివాడివని రోజూ ఇంటా బయట అనిపించుకునే ఓ నిస్సహాయ మనిషి.. ఓ బెస్ట్ రంజీ ట్రోఫీ ప్లేయర్ కథ. మొత్తంగా ఏదీ జడ్జి్ చేయని కొడుకు దృష్టిలో హీరో అవుదామని జీవితాన్ని కొంచెం కొంచెంగానైనా పట్టుదలతో సమకూర్చుకునే ఓ పోరాటయోధుడి కథ. నానీ చాల రోజుల తర్వాత మంచి సినిమా కథని ఎంచుకుని మెప్పించాడు. 
హీరోయిన్ శ్రద్ధ 1980’s హీరోయిన్ గా కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపించే గృహిణిగా బాగా నటించింది.
నాన్న నువ్వు నటిస్తే బాగుంటావ్ హీరోలా అని అందరిని మెప్పించాడు నాని కొడుకు పాత్రలోని బుజ్జోడు. 
ఈ ఎండాకాలం కుటుంబం అంత కలిసి చూడదగ్గ చిత్రం . సినిమా అంత క్రికెట్ ఆటని ప్రధానంగా ముఖ్యమైన భూమికగా తీసుకుని కథ అల్లుకున్న దర్శకుడు గౌతం పనితీరు నచ్చుతుంది.

ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయటానికి తీసుకున్న టైం వల్ల కొంచెం ల్యాగింగ్ అనిపిస్తుంది.

ఫ్లాష్ బాక్లో .. ఫ్లాష్బాక్ మళ్లీ ఫ్లాష్ బాక్ ప్రేక్షకుడికి మొదట్లో కొంచెం కనఫ్యూషన్ క్రియేట్ చేసినా తర్వాత గాడిలో పడుతుంది.ఫులెంత్ స్పోర్ట్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. love .. financial difference in family .. తండ్రి ప్రేమ.. కొడుకుకు తండ్రి పట్ల ఆరాధన .తనో గొప్ప టాలెంటడ్ ఆటగాడని ట్రైయినీ పట్ల అపారమైన నమ్మకం ఉన్న కోచ్ .. ఇలా మొత్తంగా జెర్సీ సినిమా కుటుంబం అంత కలిసిచూసే నాని మార్క్ సినిమా…!!
హాస్యం ఏదో ఉండాలి కదా అన్నట్టు బలవంతంగా పలికినట్టుంది.. నా వరకు సంగీతం అంత రిజిస్టర్ అవలేదు..చివరిగా సినిమా బాగుంది .. నాని కెరీర్లో బెస్ట్ మూవీ.. కానీ మరీ మాస్టర్ పీస్ అని చెప్పేంత కాదు. క్లైమాక్స్ లో .. పదేళ్ల క్రితం నిజం ఒకటి తెలిసినప్పుడు దానికి తగ్గ ఎమోషన్స్ ఏ కారెక్టర్ కూడా క్యారీచేయలేదని అనిపించింది. ఆ కన్విక్షన్ అక్కడున్న కారెక్టర్లతో పలికించి ఉంటే సినిమా ఇంకా సంతృప్తినిచ్చేదేమో .. 
– మెర్సీ మార్గరెట్ (writer,poet)

Share.

Leave A Reply