ఈ ఐఎఎస్‌ అధికారి చెత్తను ఎందుకు ఏరుతున్నాడు…? 

Google+ Pinterest LinkedIn Tumblr +

వీపునకు వెదురుబుట్ట తగిలించుకుని,కూరగాయల పొలాల్లో పనిచేయడం మేఘాలయ రైతుల సంప్రదాయం. తుర పట్నంలో, వెస్ట్‌కారో హిల్స్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి రామ్‌సింగ్‌ కూడా వీపుకు బుట్ట తగిలించుకొని, సేంద్రియ కూరగాయలు కొనడం కోసం వారాంతాల్లో ఏకంగా పది కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. అతనితో పాటు, భార్య కూడా కూతురిని వీపుకు కట్టుకొని మార్కెట్‌కు వెళ్లి రావడం ఆక్కడి జనానికి ఒక ఆదర్శంగా మారింది.
సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే రామ్‌సింగ్‌ తన ఫొటోలను షేర్‌ చేశారు.
అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘ కూరగాయల కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది… వాటిని మోసుకురావడం పెద్ద సమస్య అని చాలా మంది నాతో అంటుంటారు. అలాంటప్పుడు వెదురు బుట్ట తీసుకువెళ్లవచ్చు కదా, తద్వారా ప్లాస్టిక్‌ వాడకం కూడా తగ్గిపోతుంది కదా అని చెప్పాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందుకే నేనే ఆచరిస్తే వారిలో మార్పు వస్తుందని, గత ఆర్నెళ్లుగా నా భార్యతో కలిసి సరదాగా మార్కెట్‌కు నడిచి వెళ్తూ, వెదురు బుట్టలో వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటున్నా. ఆధునిక యుగంలో ఎదురయ్యే సరికొత్త సవాళ్లకు సంప్రదాయ పద్ధతే సరైన పరిష్కారం !! ‘ అంటారు రామ్‌సింగ్‌.


మేఘాలయ ప్రభుత్వం కార్యక్రమం ‘వన్‌ సిటిజన్‌- వన్‌ ట్రీ’ ని ముందుండి నడిపిస్తున్న ఈ అధికారి తన లాగే మేఘాలయ యువత కూడా ప్లాస్టిక్‌కు నో చెబుతూ పర్యావరణాన్ని కాపాడాలని, పిలుపునిస్తున్నారు.

‘కూరగాయలు కొనడానికి 10 కిలోమీటర్లు నడిచి వెళ్తాం.మాకు ఇది మార్నింగ్‌ వాక్‌. ప్లాస్టిక్‌ లేదు. కాలుష్యం లేదు. Fit India Fit Meghalaya, సేంద్రీయ పదార్థాలు తినండి. మీరు ఆరోగ్యంగా, తుర పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి’ అని ఆయన అంటున్నారు.
రామ్‌ సింగ్‌ జీవన విధానంపై నెటిజన్లు ప్రశంసలు ప్రకటించారు. ‘మీరు నిజంగా ఆదర్శనీయం, ఇండియన్‌ బ్యూరోక్రసీలో ఓ కొత్త అధ్యాయం. వాకింగ్‌ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. మీ స్పూర్తితో మేము కూడా ప్లాస్టిక్‌ను నిషేధిస్తాం.’ అంటూ కామెంట్లు వాన కురిపిస్తున్నారు. (pics credit/ RamSingh)

Share.

Leave A Reply