Prozac price cheap methocarbamol buy Dapoxetine అమరావతి కి 400మంది జర్నలిస్టులు
అమరావతి శంకుస్థాపన కవరేజ్ కోసం దేశ, విదేశీ ప్రతినిధులు వస్తున్నారని సమాచార మంత్రి చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఇతర నగరాల నుంచి వచ్చే జర్నలిస్టులు, ఇతర సాంకేతిక సహాయకులకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. 12 కెమరాలతో కూడిన ప్రత్యేకమైన యూనిట్ మొత్తం కార్యక్రమాన్ని దేశంలోని అన్ని టెలివిజన్ ఛానళ్లకు ప్రత్యక్ష ప్రసారం అందిస్తుందని తెలిపారు. దూరదర్శన్, ఏబీఎన్ న్యూస్ ఛానళ్లు సంయుక్తంగా ఈ సదుపాయాన్ని అందరికీ అందిస్తున్నాయన్నారు.
మొత్తం 65 మంది వీడియోగ్రాఫర్లు, 35మంది ఫోటోగ్రాఫర్లు, 400మంది జర్నలిస్టుల కోసం ప్రధాన వేదికకు సమీపంలోనే మీడియా గ్యాలరీ ఏర్పాటుచేశామని మంత్రి తెలిపారు. ఇదిగాక, మొత్తం కార్యక్రమం వెబ్ స్ట్రీమింగ్ కూడా చేయిస్తున్నామని, యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారంతా వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లుచేశామని మంత్రి శ్రీ పల్లె చెప్పారు. మీడియా ప్రతినిధులకు ఎక్కడికక్కడే అధికారులు పాసులను జారీచేస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఇప్పటికే ఒక మీడియా సెంటర్ తన కార్యకలాపాలను ప్రారంభించిందని, శంకుస్థాపన ప్రదేశంలో కూడా మీడియా సెంటర్ ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో కనీవినీ ఎరుగనిరీతిలో జరుగుతున్న మన ప్రజారాజధాని అమరావతిశంకుస్థాపన కార్యక్రమం గురించిప్రపంచం చర్చించుకుంటోందని అన్నారు.