500 కోట్ల పెట్టుబడి తో శ్రీసిటీలో చైనా పరిశ్రమ…

Google+ Pinterest LinkedIn Tumblr +

పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి మేధోమధనం కార్యక్రమంలో పేర్కొన్న శ్రీసిటీ యం.డీ. 

” శ్రీసిటీలో ప్రస్తుతం 50 వేల ఉద్యోగాలు వచ్చాయి, లక్ష ఉద్యోగాల కల్పన దిశగా ఈ పయనం సాగుతోంది, త్వరలో లక్ష్యాన్ని చేరుకుంటామని”  శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం అమరావతిలో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి మేధోమధనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ” 2008లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదగా శ్రీసిటీ ప్రారంభోత్సవం జరిగింది. . శ్రీసిటీ ద్వారా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలో నిరుద్యోగ సమస్య పూర్తిగా నిర్మూలించబడాలని నాడు వైఎస్ తమకు సూచించారు , ఆయన ఆశించిన మేరకు దేశంలోనే అత్యుత్తమ సెజ్ గా శ్రీసిటీ అభివృద్ధి సాధించింది, 28 దేశాలకు చెందిన సుమారు 180 పరిశ్రమలు 50 వేల ఉద్యోగాలు వచ్చావచ్చాయి . రాష్ట్రంలోనే అత్యధికంగా మహిళా ఉద్యోగులు శ్రీసిటీ లో పని చేస్తున్నారు.  దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పరిశ్రమలో 15 వేల మంది మహిళలు పనిచేయడం విశేషం.  కరోన కష్ట సమయంలోను  500 కోట్ల పెట్టుబడి తో ఓ చైనా పరిశ్రమ శ్రీసిటీలో స్థాపనకు వారం క్రితం ఎంఓయు చేసుకోవడం  రాష్ట్రానికి శుభ పరిణామం. ” అని అన్నారు. భారీ పెట్టుబడులతో  మరికొన్ని చైనా, జపాన్ దేశాలకు చెందిన పరిశ్రమలు శ్రీసిటీకి రావటానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 

రాష్ట్రంలో మంచి పాలనతో పాటు మంచి వనరులు, మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయని, పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి సాధిస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న  పలు సంక్షేమ పథకాలకు అమలుకు నిధుల కొరత వుండదని, అలాగే నిరుద్యోగ సమస్య కూడా సంపూర్ణంగా తొలగుతుందని
 రవీంద్ర సన్నారెడ్డి సూచనలు చేశారు.
ఈ సమావేశంలో శ్రీసిటీ యం.డీ తో పాటు, డైకీ అల్యూమినియం సంస్థ యం.డీ గోటో కజుషీ మరియూ జడ్.టీ.టీ సంస్థ యం.డీ చెన్ జఫాంగ్ ఈ సమావేశానికి హాజరైనారు. జడ్.టీ.టీ సంస్థ  తరఫున రు. 10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా  చెన్ జఫాంగ్  అందచేశారు.

Share.

Leave A Reply