నిరుద్యోగులకు వెలుగు బాట…

Google+ Pinterest LinkedIn Tumblr +

సిద్దిపేట జిల్లా,విఠలాపూర్‌ గ్రామానికి చెందిన రెడ్డబోయిన తిరుపతి, గాండ్లభాస్కర్‌ ఇంటర్‌ చదివి నిరుద్యోగులుగా ఉండిపోయారు. ఉపాధి లేక రోజూ కూలీలుగా మారాలనుకున్నారు… అలాంటి సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో స్కిల్‌డెవలప్‌ మెంట్‌లో శిక్షణ ఇస్తున్నారని తెలిసి అక్కడ నెల రోజులు ఉండి కొంచెం నైపుణ్యం పొందారు. వారి జీవితంలో మార్పు మొదలైంది. 
శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఏరో బ్రిడ్జిఆపరేటర్లగా ఉద్యోగాలు వచ్చాయి. విమానం రాగానే బ్రిడ్జిని దానికి చేరువ చేయడం వారి పని. రోజుకు 8గంటల డ్యూటీ. నెలకు 10,500 జీతం. వారానికి రెండు రోజులు సెలవు. మొన్నటి వరకు ఊర్లో ఎవరూ పట్టించుకోని వారు నేడు మనోళ్లు ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం చేస్తున్నారని గౌరవంగా చూస్తున్నారు. కుటుంబసభ్యుల కళ్లలో సంతోషం. 
బంతిపూల వనం నుండి భవిష్యత్‌ వైపు … 
రేణుక,మనోర,కృష్నవేణి ఒకపుడు రోజు కూలీలు. దశాబ్దం క్రితం బంతిపూల వనంలో ఎండనకా,వాననకా పూలు కోసి బతికేవారు రంగారెడ్డిజిల్లా, మామిడిపల్లి గ్రామంలో ఉంటారు. వారు పనిచేపిన పొలాల్లో ఇపుడు గాలిమోటార్లు తిరుగుతున్నాయి. వ్యవసాయ కూలీలుగా బతికిన వీరికి అక్కడే జనపనార బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. నీడపట్టున పనిచేస్తున్నారు, ఏడాదికి 50 నుండి 80 లక్షల రూపాయల విలువైన ఆర్డర్లు సంపాదిస్తున్నారు. నెలకు రూ. 8 నుండి10 వేల వరకు ఆదాయం పొందుతూ స్వయం సమృద్ధి పొందుతున్నారు. వీరే కాదు ఏడాదికి కొన్ని వందల మంది నిరుద్యోగ యువతీ యువకులు వివిధ వృత్తుల్లో శిక్షణ పొంది జీవితంలో సెటిల్‌ అయి పనిసంస్కృని చాటుతున్నారు. 
శిక్షణ ఇచ్చేది ఎవరు? 
ఆసరా అందిస్తే అందలాన్ని అందుకోగలిగే యువతీ,యవకులు ఎంతోమంది. అలాంటి వారి స్వావలంబన కోసం ఉచితంగా ఉపాధి శిక్షణ అందిస్తోంది ‘జిఎమ్‌ఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌’ (జిఎంఆర్‌విఎఫ్‌). ప్రసిద్ధ ‘జిఎంఆర్‌’ గ్రూపులో కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీకి చెందిన విభాగమిది. 
పన్నెండేళ్ల క్రితం ప్రారంభమైన జిఎంఆర్‌విఎఫ్‌, దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధికల్పనలో అట్టడుగు వర్గాలకు అండగా నిలిచింది. నిరుద్యోగ యువతీయువకులకు, నిరుపేద మహిళలకు పలు అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి, నిపుణులుగా తీర్చిదిద్ది, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా క షిచేస్తోంది. విద్య, వైద్య రంగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను కూడా చేపట్టి వృత్తి నిపుణులను ప్రమోట్‌ చేస్తోంది. 
ఏటా 800మందికి ఉపాధి 
దశాబ్ద కాలంగా సుమారు 7,500 మంది యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రతిఏటా దాదాపు 800 మంది ఉచిత శిక్షణ పొందుతున్నారు. అలా శిక్షణ పొందిన వారిలో కొందరు స్వయంగా ఉపాధి కల్పించుకుంటున్నారు. మరికొందరు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. 
నైపుణ్య శిక్షణ ఎలా..? 
5వతరగతి నుండి ఇంటర్‌ మీడియట్‌ వరకు ఎవరికి అవసరమైన వృత్తి విద్యలో వారికి శిక్షణ ఉంది. 18నుండి 30సంవత్సరాల వయసు గల యువతీ యువకులు అర్హులు. అభ్యర్దులకు శిక్షణతో పాటు, ఉద్యోగాలు పొందడానికి వీలుగా సాఫ్ట్‌ స్కిల్స్‌లో కూడాశిక్షణ ఇస్తారు. 
అంతా ఉచితమే.. 
శిక్షణ పూర్తి ఉచితం.వసతి, ఆహారం ఇవ్వడమే కాకుండా యూనిఫామ్‌, కోర్సుకు సంబంధించి పుస్తకాలు,పరికరాలు ఇస్తారు. మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవాలి. తర్వాత సంస్థ ప్రతినిధులే వీరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటారు. ఉద్యోగులు కావాల్సిన సంస్థల జాబితా నిర్వాహకుల దగ్గర ఉంటుంది. వీరు ఆయా జాబితాలోని సంస్థలను సంప్రదించి తమ వద్ద శిక్షణ పొందిన వారి వివరాలు ఇచ్చి ఉద్యోగం ఇప్పించేందుకు సహకరిస్తారు. 
శిక్షణ పొందే కోర్సులు ఇవే… 
1,డ్రైవాల్‌,ఫాల్స్‌ సీలింగ్‌,2,ఎక్సవేటర్‌ ఆపరేటర్‌,3, వెల్డింగ్‌ టెక్నీషియన్‌,4,రిఫ్రిజిరేషన్‌,ఎయిర్‌ కండీషనింగ్‌,5,ఆటోమొబైల్‌ ,టూవీలర్‌ రిపేరింగ్‌,6,ఎలిక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌,7, సోలార్‌ టెక్నీషియన్‌.8కారు డ్రైవింగ్‌,9,కంప్యూటర్‌ యంఎస్‌ ఆపీస్‌,డిటిపి,10 టైలరింగ్‌ (మహిళలకు మాత్రమే) ఆటోమొబైల్‌, ద్విచక్రవాహనాల రిపేరింగ్‌, ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌ వంటి కోర్సులకు కనీసం ఎనిమిదో తరగతి చదివి 18సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకులు అర్హులు. వీరికి ఉచిత హాస్టల్‌ వసతి కల్పించండంతోపాటు మూడు నెలల పాటు నిపుణులతో శిక్షణ కల్పిస్తారు. శిక్షణ కాలంలో యోగా, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, కరాటే, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ విద్య వంటి అంశాల్లో నిపుణులచే మెలకువలు నేర్పిస్తారు. 
ఈ ధృవీకరణ పత్రాలు ఉండాలి.. 
విద్యార్హత, ఆధార్‌, వయస్సు ధృవీకరణ,రేషన్‌ కార్డు, ఫొటోలు ప్రతీదీ 5కాపీలు చొప్పున అందచేయాలి. 
శిక్షణ ఎక్కడ? 
శంషాబాద్‌ సమీపంలో జియంఆర్‌ వరలక్ష్మి సెంటర్‌ ఫర్‌ ఎంపవర్‌ మెంట్‌, లైవ్‌లీహుడ్స్‌, ఎయిర్‌ పోర్ట్‌ క్యాంపస్‌,చిన్మయి స్కూల్‌ దగ్గర, మామిడిపల్లి రోడ్‌,శంషాబాద్‌. 
ఇలా వెళ్లండి…. 
శంషాబాద్‌ ఆర్టీసీ బస్‌స్టాండ్‌ ఎదురుగా మామిడిపల్లి గ్రామానికి వెళ్లే ఆటోలు ఎక్కి జీఎంఆర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కి అంటే తీసుకెళ్తారు. మరిన్ని వివరాలకు 9494800102, 8919890976, 9985574742 కి కాల్‌ చేయవచ్చు. 

Share.

Leave A Reply