న్యూమీడియా పాత్రికేయుల వేదిక తొలి అడుగు…

Google+ Pinterest LinkedIn Tumblr +

మీడియారంగంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్‌ మీడియాకు గుర్తింపుతో పాటు ప్రింట్‌,ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుల మాదిరిగా ప్రభుత్వ సౌకర్యాల వర్తింపు కోసం కృషి చేస్తామని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ దేవుల పల్లి అమర్‌ అన్నారు. అనుక్షణం తాజా వార్తలను ప్రపంచానికి అందిస్తున్న ఆన్‌ లైన్‌ మీడియా జర్నలిస్టులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం(15.7.2015)బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన TOMJA  (తెలంగాణ ఆన్‌లైన్‌మీడియా జర్నలిస్టుల అసోసియేషన్‌)ఆవిర్బావ సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు.

మన దేశంలో కేవలం ప్రింట్‌మీడియాకు మాత్రమే చట్టాలున్నాయని ఎంతో విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్‌,ఆన్‌లైన్‌ మీడియా… వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టం పరిధిలో లేదని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆన్‌లైన్‌ మీడియా సంఘటితమైతే వారికి తోడ్పడడానికి ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌,తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం సిద్దంగా ఉన్నాయన్నారు. గతంలో ప్రింట్‌ ,ఎలక్ట్రానిక్‌ మీడియాలో సుధీర్ఘ కాలం పనిచేసిన జర్పలిస్టులు ప్రస్తుతం న్యూమీడియా(వెబ్‌ పోర్టల్‌) నిర్వహణకు ముందుకు వస్తున్నారన్నారు. సోషల్‌మీడియా విస ్తృతిని దృష్టిలో ఉంచుకొని గత మే నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఐజెయు ప్లీనరీలో ఈ రెండు మీడియాలను వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టంలో పొందపర్చాలని కోరుతూ తీర్మానం చేశామని చెప్పారు. ఐజెయు కార్యదర్శి వై.నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్‌ మీడియా పాత్రికేయుల హక్కుల కోసం కృషి చేయాల్సిన అవపసరం ఉందన్నారు.
ఆన్‌ లైన్‌ మీడియా రాష్ట్ర అధ్యక్షుడిగా అయులు రమేష్‌
తెలంగాణ ఆన్‌లైన్‌ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్‌ ( TOMJA) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆన్‌లైన్‌ మీడియా జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా అయిలు రమేష్‌,ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్‌రెడ్డి,ఉపాధ్యక్షులుగా సీనియర్‌ జర్నలిస్టులు ఎం.ఎస్‌.శంకర్‌, శ్యాంమోహన్‌(ruralmedia,in) ,కనక దుర్గ,వేముల సదానందం, కార్యదర్శులుగా సూర్యారావు, రాజేశ్‌,ప్రభుదాస్‌, కృష్ణయ్య ,కోశాధికారిగా జలపతి గౌడ్‌,కార్యవర్గసభ్యులుగా కళ్యాణం శ్రీనివాస్‌, సంతోష్‌,గుమ్మడిశ్రీనివాస్‌,రణధీర్‌,శంకర్‌గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం సీనియర్‌ నేత శ్రీనివాసరెడ్డి, ఐజెయు కార్యవర్గ సభ్యుడు కె.సత్యనారాయణ,టియుడబ్ల్యు.జె ఉపాధ్యక్షుడు కరుణాకర్‌,ఆలపాటి సురేశ్‌ కుమార్‌ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Share.

Comments are closed.