లెమన్ ట్రీ హోటల్ లో , కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ రూ.40 వేలు!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆక్సిజన్‌తో సహా అన్ని సదుపాయాలతో వారం రోజుల పాటు చికిత్స 

నిరంతరం డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, అంబులెన్స్‌ సేవలు 

ఎక్కడ ?

 Lemon Tree Hotel, Road no- 1, Beside Care Hospital, Banjara Hills, Hyderabad, హెల్ప్‌లైన్‌ నెంబర్లు ( 10 am to 6 pm ) 91211 55500,  91213 55500,

కోవిడ్‌ వైద్యం అత్యంత ఖరీదైపోయింది.ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి.  కరోనా  వైరస్‌ బారిన పడిన వారు  జబ్బుతో వచ్చే బాధలకంటే వైద్యానికి అయ్యే ఖర్చును తలచుకొని విలవిల్లాడుతున్నారు. .

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను అందజేసేందుకు  ‘ కోవిడ్‌కేర్‌ సెంటర్‌’తో ముందుకు వచ్చింది జైన్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్చంద సంస్థ.

దాతల సహాయ సహకారాలతో పని చేస్తున్న ఈ సంస్థ  విద్య, వైద్య రంగాల్లో తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తోంది.

  ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా, వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ Isolation Centre లో కోవిడ్‌ బాధితులకు  వైద్య సేవలు లభిస్తాయి. కేవలం నామమాత్రపు ఫీజులతో అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు  జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌  ప్రతినిధి   తెలిపారు. 

ఇవీ ప్రత్యేకతలు… 

♦️కోవిడ్‌ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన వారు ఈ Isolation Centre లో చేరవచ్చు.  

♦️ఒక గదిలో ఇద్దరు  చొప్పున ఉంటే  వారం రోజులకు ఒక్కొక్కరు రూ.30,000 చొప్పున చెల్లిస్తే చాలు. 

♦️ఒక్కరే  ప్రత్యేకంగా ఒక సింగిల్‌ రూమ్‌లో ఉండాలనుకొంటే  వారం రోజులకు రూ.40,000 ఫీజు ఉంటుంది.  

♦️ఈ ఫీజులోనే కోవిడ్‌ నివారణకు అవసరమయ్యే మందులు, చికిత్స, ఆక్సిజన్‌ (అవరమైన వారికి), తదితర అన్ని సదుపాయాలు లభిస్తాయి. 

♦️పేషెంట్‌లు త్వరగా కోలుకొనేందుకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేస్తారు. అయితే కేవలం శాఖాహారం మాత్రమే ఇస్తారు.  

నిరంతరం వైద్య సేవలు

♦️ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో (Isolation Centre )  వైద్య నిపుణులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. అలాగే నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది రోగులను కనిపెట్టుకొని ఉంటారు.  

♦️అంబులెన్స్‌ సదుపాయం ఉంటుంది.  

♦️అత్యవసర పరిస్థితుల్లో  రోగులను  పెద్ద ఆసుపత్రులకు తరలించే సేవలు ఉంటాయి. 

♦️ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆక్సిజన్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెంటిలెటర్‌లు ఉండవు. రోగికి వెంటలెటర్‌ అవసరమైతే మాసాబ్‌ట్యాంకులోని  మహావీర్‌ ఆసుపత్రిలో తక్కువ చార్జీల్లోనే  వెంటిలెటర్‌ సదుపాయంతో కూడిన వైద్యాన్ని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హెల్ప్‌లైన్‌ నెంబర్లు ( 10 am to 6 pm ) 91211 55500, 91213 55500, Rohit kotari –  93470 07677 Lalit chopra – 98490 13585

Share.

Leave A Reply