అక్షర సేద్యంలో ‘ జైకిసాన్‌ ‘

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆగ్రోఫామ్స్‌,మార్కెటింగ్‌,ప్రచురణ రంగంలో అనుభవం ఉన్న జనమిత్రాస్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ సంస్ధ నుండి రైతు సోదరుల కోసం సరికొత్త కర్షక పత్రికను ప్రచురిస్తోంది. శనివారం ప్రెస్‌ అకాడమీచైర్మన్‌ అల్లం నారాయణ ‘ జైకిసాన్‌ ‘ ఆవిష్కరించి మాట్లాడుతూ, ‘ఆధునిక వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించేలా ఈ పత్రిక రైతులకు ఉపయోగపడాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని, సాంకేతికతను అన్ని ప్రాంతాల రైతులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ‘ అన్నారు. 
రైతులకు నిరంతర సమాచారం 
” రైతులకు మెరుగైన వ్యవసాయ సమాచారం అందించే లక్ష్యంతో జైకిసాన్‌ ప్రారంభించామని,ఆహార పంటలు,చిరుధాన్యాలు,వాణిజ్య,ఉద్యాన పంటల సాగు,కోళ్లు,పశువుల పోషణపై ఆధునిక పద్దతులు,అరుదైన విశేషాలతో ప్రతీనెలా ఈ పత్రిక రైతులకు అందిస్తుందని ” జైకిసాన్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ చల్లా నారాయణ రావు పేర్కొన్నారు. 
రైతులకు పెన్నిధిగా…. 
సీనియర్‌ పాత్రికేయులు ,ప్రముఖ దినపత్రికల్లో దశాబ్దాల అనుభవం ఉన్న బి.శాంతారాం ఈ వ్యవసాయ పత్రికకు ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ” ఇపుడున్న వ్యవసాయ పత్రికలకంటే భిన్నంగా జైకిసాన్‌ని రూపొందిస్తున్నాం. బంజరు భూముల్లో బంగారం పండించేలా రైతులను చైతన్య పరిచి వ్యవసాయం పట్ల యువతరంలో మక్కువ పెంచేలా మా ఎడిటోరియల్‌ టీమ్‌ నిరంతరం కృషి చేస్తుంది.” అని ‘రూరల్‌మీడియా’ ప్రతినిధికి వివరించారు.

Share.

Comments are closed.