పుడమి ప్రియ పుత్రికలు

Google+ Pinterest LinkedIn Tumblr +

రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఏదో ఒకటే పంటను సాగు చేయడం వల్ల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఎడతెగని సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చేస్తున్నది వ్యవసాయమే అయినప్పటికీ ఇంట్లోకి కూరగాయలు, పప్పులు కూడా కొనుక్కొని తినాల్సిన దుస్థితి. వెరసి పేదరికం, పౌష్టికాహార లోపం కుటుంబాలను కుంగదీస్తూ ఉంటుంది. ఇక రైతు ఆత్మహత్య పాలైన కుటుంబాల్లో కుటుంబ పోషణతోపాటు వ్యవసాయ బాధ్యతలు కూడా మహిళలపైనే పడుతోంది.
రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేకపోవడం, కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని తామే పండించుకోగలగడంతో వీరంతా సంతోషంగా ఉన్నారు. ఏయే పంటలు వేయాలి? ఏ కాలంలో ఏ పంటలు వేయాలి? ఎలా అమ్మాలి? కరువును తట్టుకునే వ్యవసాయం ఎలా చేయాలి? అనే విషయాలపై మహిళలే ఇప్పుడు ని ర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.
రోజూ కూలీ.. రైతుగా మారింది
కేవలం రెండెకరాలున్న పేద రైతు దంపతులు బొగ్గం జయమ్మ, నర్సింహారావు. ఖమ్మం జిల్లా,జగన్నాథపురం మండలం,రాజాపురం గ్రామంలో ఉన్న ఆ భూమి సేద్యానికి అనువుగా లేని ఎగుడు దిగుడు వర్రెలు, వంకలు, ముళ్ల చెట్లతో నిండి పోయింది. దీనికి తోడు ఆ ప్రాంతంలో వర్షాధారం మీద మాత్రమే సాగు చేయాలి. అలాంటి కరవు నేలను చదును చేసుకునే స్తోమత లేని ఆమె భర్త సమీప పట్నానికి వలస పోయాడు.
ఇలాంటి పరిస్థితిల్లో ఎలాగైనా తమ బంజరు భూమిని సాగులోకి తెచ్చే అవకాశాల కోసం ప్రయత్నిస్తూ , గ్రామ సభలో తన సమస్యను చెప్పుకుంది బొగ్గం జయమ్మ. ఉపాధిహామీ పథకంలో భాగంగా ఈ రైతు భూమిని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు మంజూరు కాగా రెండెకరాల భూమిని సాగుకు అనువుగా మార్చింది. భర్తను వెనక్కి రప్పించి ఎత్తు, పల్లాలుగా ఉన్న మట్టి దిబ్బలను తవ్వి ఎగువ ప్రాంతంలోని మట్టిని దిగువ ప్రాంతంలో వేయడం ద్వారా భూమిని చదును చేశారు.

jayamm-rajapuram

jayamm-rajapuram

నర్సింహారావు తన భార్య జయతో కలిసి రాత్రిపగలు భూమిని అభివృద్ధి చేసే పనుల్లో పాల్గొని , సాగునీటికోసం తన భూమిలోనే చిన్ననీటి కుంటను తవ్వుకుని వాననీటిని నిలువ చేసి, భూమిలో తేమను పెంచారు. అరఎకరాలో వరి పండించి సుమారు 15 బస్తాల దిగుబడి సాధించారు. మిగిలిన ఒకటిన్నరెకరాల్లో జామాయిల్‌ తోటను పెంచుతున్నారు.
గతంలో కేవలం దినసరికూలీగా బతికిన ఈ దంపతులు పట్టుదలతో కష్టించి తమ బీడుభూమిని సాగు భూమిగా మార్చుకుని రైతులుగా మారారు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ సుస్థిర ఆదాయం పొందుతున్నారు.
జయమ్మ సాధించిన ప్రగతి చూసి మిగతా రైతులు తమ భూములను అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆరోగ్యం, ఆదాయం… anita-khasimpur
” సేంద్రియ పద్ధతుల్లో అనేక పంటలను కలిపి సాగు చేయడం నేర్చు కున్నా. నా భర్తకు సుగర్‌, రక్తపోటు సమ స్యలున్నాయి. అందుకే మా కుటుంబానికి మంచి పౌష్టికాహారం కోసం సేంద్రియ సేద్యం చేస్తున్నా. 3 ఎకరాల్లో 15 రకాల పంటలను సాగుచేస్తున్నా. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పంటల దిగుబడి 2 రెట్లు పెరిగింది. ఖర్చు పోను ఎకరాకు రూ. 16 వేల ఆదాయం వస్తోంది. ఎకరంలో చెరకు పంటను కూడా సేంద్రీయ పద్దతిలో పండిస్తున్నాం.” అంటారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం ఖాసింపూర్‌ గ్రామానికి చెందిన అనిత.
భర్త ఎడారి దేశానికి వలస వెళితే…
అబ్దుల్‌ హమీద్‌ కి మోమిన్‌పేట( రంగారెడ్డి జిల్లా) 5 ఎకరాలు భూమి ఉంది కానీ, సాగునీటి వసతి లేక పడావుగా మిగిలిపోయింది. సాగు చేసే ప్రయత్నం చేసినా విత్తనాలు, కూలీలకు ఖర్చు పెట్టిన పెట్టుబడి కూడా మిగిలేదికాదు. ఈ బాధలు పడలేక బతుకుతెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లాడు. అపుడు అతడి భార్య షహనాజ్‌బేగం తమ నేలను అలా వదిలేయకుండా సాగు బాధ్యత తీసుకుంది.
ఐదేళ్ల క్రితం వెల్‌చాల్‌ గ్రామంలో ‘రీడ్‌’ సంస్థ వాటర్‌షెడ్‌ కార్యక్రమాలు మొదలుపెట్టి వాననీటిని నేలలోనే ఇంకింపచేసే పనులు చేశారు. దీంతో భూగర్భ జాలాలు పెరిగాయి. దీంతో షహనాజ్‌బేగం బీడు భూమిని సాగులోకి తెచ్చింది. వారి పొలంలో ఎండిపోయిన బోర్‌లో జలసంరక్షణ వల్ల నీటిమట్టం పెరిగింది. ఇపుడు వారి బంజరు నేల మామిడి,సపోటాతో కళకళలాడుతోంది అంతరపంటగా స్వీట్‌కార్న్‌, కూరగాయలు పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. తమ భూమి బంగారంగా మారడంతో హమీద్‌ గల్ప్‌ నుండి తిరిగి వచ్చి భార్యకు తోడుగా వ్యవసాయం చేస్తున్నాడు.
ఉల్లి చేలో పల్లె నవ్వింది

నాలుగు ఎకరాల రైతు నాగమణి. కానీ అదంతా బీడు నేల. సాగు చేయాలంటే వాన పడాల్సిందే. వేరే దారి లేదు. అందువల్ల కేవలం జొన్నలు మాత్రమే పండించేవారు. దాని మీద ఆదాయం పెట్టుబడికి కూడా సరిపోయేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి పొలాలకు ఎగువలో 4 ఫారంపాండ్స్‌, 2 చెక్‌ డ్యామ్స్‌, రాక్‌ఫిల్‌ డ్యామ్స్‌ నిర్మించారు. దీంతో గత సంవత్సరం కురిసిన వాన నీరు పల్లపు ప్రాంతానికి పోకుండా ఎక్కడికక్కడే ఇంకిపోయింది. బంజరు భూమిగా ఉన్న పర్వతాపూర్‌ (వికారాబాద్‌ జిల్లా) ప్రాంతంలో వాటర్‌ షెడ్‌ వల్ల జలకళ సంతరించుకుంది. బోర్లలో జలమట్టం మూడు రెట్లు పెరిగింది. పంట దిగుబడి కూడా పెరిగింది.నాగమణి తన భర్త గోపాల రెడ్డితో కలిసి ఉల్లి సాగుచేస్తూ ఎకరానికి 80 వేలు ఆదాయం పొందుతున్నారు. కొంత భూమిలో పసుపు, పెసర కూడా పండిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు.
వంద గ్రామాలకు నీళ్లు తెచ్చిన మహిళా శక్తి
వేసవే కాదు, ఏడాదంతా నీళ్ల కోసం కన్నీళ్లు పెట్టే గ్రామాల్లో అదొకటి.
నీటి ఎద్దడితో ఏడాదికి ఒక్క పంటనూ పండించుకోలేక పేదరికంతో అల్లాడిపోయే జనం వలసలు పోతున్న ఊరు అది. అలాంటి గిరిజన పల్లెలో నలభై పంటకుంటలు,నాలుగు చెక్‌ డ్యామ్‌లను నిర్మించి రైతుల నీటి కష్టాలను తీర్చి, అన్ని రకాల పంటలు పండించుకునేలా చేసింది, గిరిజన మహిళ మడివి లక్ష్మీదేవమ్మ.  ఎనిమిదేళ్ల క్రితం మహదేవపురం(దుమ్ముగూడెంమండలం,భద్రాద్రిజిల్లా)సాగునీరు,తాగునీటి సదుపాయం లేక కరవు తాండవమాడేది. ఇదంతా లక్ష్మీదేవమ్మ చూస్తూ ఊరుకోలేదు.laxmidevamma-mahadevapuram
నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తమ  గ్రామాలను తిరిగి సమస్య గురించి తెలుసుకుంది. అదే సమయంలో ఆ గ్రామంలో అడుగు పెట్టిన ఏఎస్‌డిఎస్‌ స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధులు శ్రమదానంతో పనులు చేస్తే వలసలు ఆగుతాయని చెప్పారు. తానే పలుగు పార పట్టింది. ఆమె ఒక్కడుగు ముందుకు వేస్తే ఆమె వెనుక ఊరంతా కదిలింది. ఎనిమిది నెలల తరువాత ఊరు మారడం మొదలైంది. స్వచ్ఛంద సంస్ధల శిక్షణతో జలసంరక్షణ పద్దతులు తెలుసుకున్నారు. 15మంది మహిళలతో బృందంగా ఏర్పడి మహదేవపురం వాటర్‌ షెడ్‌ గ్రామాభివృద్ది కమిటీగా ఏర్పడ్డారు.
వీరి గ్రామం చుట్టూ చిన్నాపెద్దా కొండలున్నాయి. వర్షాకాలంలో అక్కడి నుంచి వచ్చే నీటితోనే వ్యవసాయం చేసేవారు గిరిజనులు. అయితే.. ఒక్కసారిగా పారే నీటికి ఎక్కడా అడ్డుకట్టలు లేకపోవడంతో నీరంతా వృథాగా పోయేది.రాతికట్టలు,ఫారంపాండ్స్‌,పొలం చుట్టూ కందకాలు తవ్వడం, చెక్‌డ్యామ్‌ల ద్వారా ఆ జలాన్ని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలని నిర్ణయించుకుంది లక్ష్మీదేవమ్మ. తక్కువ ఖర్చుతో నిర్మించే ఈ పనుల వల్ల ఎగువ నుంచి వచ్చే వర్షపు నీటిని తమ గ్రామంలోనే ఇంకిపోయేలా చేశారు. ఇపుడా గ్రామం పాడి,పంటలతో కళకళలాడుతోంది.
సేంద్రీయ కంది బహు రుచి
” నేను గతంలో పండించిన కందిపంట వేరు.. ఇప్పుడు పండిస్తున్న కందుల రుచి వేరు” అని అంటోంది… జహీరాబాద్‌ బాద్‌కి చెందిన శోభమ్మ.
తన ఇంటి నుంచి కిలోమీటర్‌ దూరంలో ఒక చిన్న వాగు దాటిన తర్వాత శోభమ్మ పొలంలోకి వెళ్లి పనులు చేస్తుంది.mana telangana.paper clip
రెండు ఎకరాల్లో కంది పంటను సాగు చేస్తున్నది శోభమ్మ. కాయదశలో ఉన్న కంది పొలాన్ని సంతప్తిగా చూస్తున్న ఆమెను పలకరించినప్పుడు… ”గతంలో నేను కంది పంటని రసాయనాలతోనే పండించేదానిని. ఇప్పుడు సుభాష్‌ పాలేకర్‌ పద్ధతిలో ప్రక తి వ్యవసాయం చేస్తున్నా. దీని వల్ల రసాయనిక ఎరువులు, పురుగుమందులకు స్వస్తి చెప్పాను. ఆరోగ్యకరమైన పంటను పండిస్తున్నాను. గతంలో నేను పండించిన కందిపప్పు కంటే ఇప్పుడు పండిస్తున్న కందిపప్పు ఎక్కువ రుచిగా వుంటోంది.
……………
శ్యాంమోహన్‌ (9440595858)

Share.

Leave A Reply