ఏడులక్షల మందికి ఈ ‘ గ్రౌండ్ రిపోర్ట్ ’ పాఠంగా ఎలా మారింది ?

Google+ Pinterest LinkedIn Tumblr +

‘ దేవుడా లోకం అల్ల కల్లోలంగా ఉంది. ఒక్కసారి కనిపించవా…?’ అని, మొర పెట్టు కోగా …

‘‘అదిగో ఆ అడవి వైపు వెళ్లు. మారువేషంలో నేను అక్కడ సంచరిస్తుంటాను..’’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.

భద్రాద్రి జిల్లా, అరణ్యంలో, కాలిబాటలో చుంచుపల్లి, చంద్రుగొండ, ఆళ్లపల్లి వైపు వెళ్తే.. అటువైపు చూడడానికూడా కాదు, కనీసం వారిని తాకడానికి కూడా ఇష్టపడని గూడెంలో… పేద బిడ్డలకు వైద్యం చేస్తూ కనిపించారు, డాక్టర్ కపిల్ శర్మ.

‘‘ సగుడ్ కోక్ల మతెకే తోడ్డితున్ ధస్తీతున్ దోహన

(తుమ్ము, దగ్గు ఉంటే నోటికి వస్త్రాన్ని చుట్టు కోవాలి..)

కైక్ నోర్వక్నే మోకమున్, మోసోడున్, తోడితున్, ఇట్వా.గుబ్డా మన్వా..’’

(చేతులను కడగకుండా ముఖాన్ని, ముక్కును, నోటిని తాకవద్దు.. )

అని గోండు భాషలో ఒపిగ్గా వారికి చెబుతున్నాడు.

ఇక్కడ 300ల కుటుంబాలు కూలీ పని చేసుకొని బతుతున్నాయి. ఇప్పటి పరిస్ధితుల్లో ఆ పనులు కూడా తగ్గిపోయాయి. విద్య,వైద్యం లాంటి, కనీస సౌకర్యా లకు దూరంగా జీవిస్తున్న ఈ దిక్కులేని జనానికి డాక్టర్ కపిల్ అండగా నిలిచాడు. హైదరాబాద్ కార్పొరేట్ అసుపత్రిలో ఉద్యోగం మానేసి ఈ జనం మధ్యకు వచ్చాడు. ఆయన వెనుకే భార్యకూడా వచ్చి సేవలు అందిస్తున్నారు.

story in janaganamana book

ఆ గ్రామాలకు చెందిన 40 మంది యువకులను కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా తీర్చిదిద్దారు. గర్భిణులకు పురిటినొప్పు లు వచ్చినప్పుడు దవాఖానకు తీసుకెళ్లడంలో వారు సహకరిస్తున్నారు.

రక్తహీనత తో ఉన్న పసివాళ్లను గుర్తించి, పోషకాహారం ఇస్తున్నారు.

వీరు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల ఇప్పటికీ ,అక్కడ కరోనా కేసులు జీరో. మాస్కు లు లేకుండానే వారి మధ్య ధైర్యంగా పనిచేస్తున్నారు.

డాక్టర్ కపిల్ తో మాట్లాడిన తరువాత, లోకం మరీ అనాధ కాదని, మానవత్వం కనుమరుగై పోలేదని , గుండెల్లోని తడి ఇంకా ఇంకిపోలేదని నమ్మకం ఏర్పడింది.

 సీన్‌ ఇక్కడ కట్‌ చేస్తే…

 ఈ గిరిజను జీవన చిత్రాన్ని‘కరోనాపై కొమ్ముబూర ’గా రాశాను.MCRHRD Institute ప్రచురించిన ‘జనగణమన తెలంగాణ’ పుస్తకంలో తొలి కథనం ఇది.

exam paper

ఆంధ్ర ప్రదేశ్‌లో 16,208 గ్రామ,వార్డు సచివాయ ఉద్యోగాకు సెప్టెంబర్‌ 20 న రాతపరీక్షలు జరిగాయి. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ నిర్వహించిన ఈ పరీక్షను 7,69,034 మంది రాశారు.‘ కరోనాపై కొమ్ముబూర ’ స్టోరీని  సచివాయ ప్రశ్నా పత్రంలో 10వ పేజీలో, 21వ ప్రశ్నలో  గద్యభాగంలో యధాతదంగా ఇచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు.  ‘గ్రామాభివృద్ధి కోసం పని చేయబోతున్న మాకు  ఈ స్టోరీ  స్ఫూర్తి దాయకం..’ అని,  పరీక్షకు హాజరైన కొందరు నిరుద్యోగులు మాకు ఫోన్‌ చేశారు.

అడివి పుత్రుల హృదయాలను గెలిచి, ప్రకృతిని ఆసుపత్రి ఒడిగా మార్చి, వారికి నీడనిచ్చే చెట్టుగా… ఓదార్చేపిట్టలా.. మారిపోయిన కపిల్ దంపతుల స్టోరీని , పరీక్షహాలులో చూసి మానవత్వం మురిసిపోయింది.

Share.

Leave A Reply