శాంతి ఆ పల్లెకు కొత్త కాంతి కాదంటారా?

Google+ Pinterest LinkedIn Tumblr +

‘‘ చిత్తూరు జిల్లా మొత్తం మీద ఈ టేస్ట్ ఎక్కడా ఉండదు.. ఇక్కడ స్టీమ్ దోసెలు తినితీరాలి . ’’ అని, పలమనేరు సెంటర్‌లో ఉన్న హోటల్ లోకి తీసుకెళ్తూ అన్నాడు మిత్రుడు. అరచేయంత దలసరి దోసె కొత్తిమిర చెట్నీతో రుచి చూశాక, మరొక్కటి తినాలిపించింది.
హోటల్ బయటకు రాగానే సునందగారు కారులో మా కోసం వెయిట్ చేస్తున్నారు.
సునంద అంటే, పలమనేరులో ఎవరికీ తెలీక పోవచ్చుకానీ, రామకుప్పం, తవనం పల్లి,భైరెడ్డిపల్లి మండలాల, గిరిజనులను అడిగితే, ‘మా బతుకుల్లో ఆమె వెలుతురు కిరణం…’’ అంటారు. మామిడి ,బత్తాయి తోటలకు కాపలాగా బతికే వారిని ఏకం చేసి, సొంత తోటలకు యజమానులు గా చేశారు ఆమె. అదెలా జరిగిందో మరో సారెపుడైనా చెబుతాను…
గంటన్నర ప్రయాణించాక, ‘ నెలిపట్ల’ యానాది కానీలోకి ఎంటర్ అయ్యాం. రెండువందల కుటుంబా లు వ్యవసాయ పనుల మీద బతుకుతున్నారు.
వారి మధ్య post graduation చేసిన ఒకే ఒక్కఆడబిడ్డ శాంతి. సర్కారీ కొలువు దొరికితే సెటిల్ అవుదామనుకుంది కానీ, అది కనుచూపు మేరలో కానరాలేదు.
అలా టైం వేస్టు చేయకుండా, దిక్కూమొక్కూ లేకుండా ఉన్న తన పల్లె ప్రజల బతుకు మార్చే దిశగా అడుగులు వేసింది.
వందలాది కుటుంబాల్లో తానొక్కతే చదువుకోవడం ఎందుకు జరిగిందని ఆలోచించింది. తన లాగే తన జాతి మొత్తం అక్షరాలు దిద్దితేనే తమ బతుకులు బాగుపడతాయని డిసైడ్ అయింది.
సర్కారీ బడుల్లో చదువుతున్న పిల్లలకు, హోం వర్క్ చేయించడానికి తల్లిదండ్రులకు చదువు లేదని గ్రహించింది. అందుకే ప్రతీ రోజు సాయంత్రం వారికి సప్లమెంటరీ పాఠశాలను నిర్వహిస్తు,పాటలు , ఆటల తో వారి మెదడుకు పదును పెడుతోంది. ‘‘ వీళ్లంతా, తనకంటే పెద్ద చదువులు చదవాలనే ధ్యేయంతో వారికి రోజూ, నాకు తెలిసిన విజ్ఞానం పంచుతున్న… ’’ అని ఒక నమ్మకంతో మాతో చెప్పింది. ఆమెకు సునందగారు కొంత ఆర్ధిక తోడ్పాటు అందిస్తున్నారు.
ఈ శాంతి ఆ పల్లెకు కొత్త కాంతి కాదంటారా? చిన్న ప్రయత్నమే కావచ్చు కానీ శాంతి చేస్తున్న పని వల్ల రేపు అక్కడ ఒక కొత్త తరం తయారవొచ్చు.

Share.

Leave A Reply