మహిళలు ఇక నిలబడి పోసుకోవచ్చు… 

Google+ Pinterest LinkedIn Tumblr +

మహిళలు ఇంటి నుండి బయటకు వస్తే మూత్ర విసర్జన ఒక పెద్ద సమస్య. పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఉన్నా ,అపరిశుభ్రంగా ఉంటాయి. కాలేజీ, రెస్టారెంట్లు, పర్యాటక ప్రదేశాలు, మాల్స్‌ లేదా సినిమా హాల్స్‌ ప్రదేశాల్లో మహిళలు మూత్ర విసర్జన కోసం నిత్యం అసౌకర్యం గురవుతుంటారు. గర్భిణీ మహిళలు, మోకాలి నెప్పులున్న వారు, కూర్చొని పోసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. బయటకు చెప్పుకోలేని ఇలాంటి సమస్యలను నుండి మహిళలను విముక్తి చేయడానికి , మగాళ్లు లాగే నిలబడి సౌకర్యవంతంగా పోసుకోవడానికి ఒక అరుదైన డివైస్‌ ఇపుడు వచ్చింది.
దాని పేరు ‘పీ కోన్‌’ డిస్పోసల్‌ యూరినేషన్‌ డివైస్‌. ప్రదీప్‌ యాడ్‌ ఇండియా సంస్థ దీనిని తెలంగాణ మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చారు.
ప్రతీ ఇంటికి అవసరమైనది… 

Female Urination Device

Female Urination Device

‘ మహిళలు వేలాది సంఖ్య లో ఉపయోగించే టాయిలెట్స్‌ అపరి శుభ్రంగా మారుతాయి, వాటిని వాడటం వలన స్త్రీలకు మూత్ర సంబంధ వ్యాధులు వస్తున్నాయి. ఇది అందరూ అలోచించాల్సిన పెద్ద సమస్య. ప్రతీ ఇంట్లో సమస్య దీనికి సరికొత్త పరిష్కారం ఈ ‘పీ కోన్‌’ . గర్భిణీ స్త్రీలు కూడా అంటురోగాలకు గురవుతున్నారు. వీటి నివారణకు ఈ డివైస్‌ ఎంతగానో ఉపయోగ పడుతుంది.” అని ప్రముఖ యువనటులు రామ్‌ కార్తీక్‌,ప్రణీత్‌ రెడ్డి వీటిని మార్కెట్‌లోకి విడుదల చేస్తూ, అన్నారు.
మహిళల ఆత్మగౌరవం పెంచేది… 
” తరతరాలుగా స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ సున్నిత సమస్య ను గుర్తించిన తమ సంస్థ, రీసెర్చ్‌ చేసి ఈ పీ కోన్‌ ని, తయారు చేశాం. దిని ద్వారా ఎలాంటి పబ్లిక్‌ టాయిలెట్స్‌లోనైనా, పరిశుభ్రం లోపించినా, సునాయాసంగా పీ కోన్‌ ని ఉపయోగించి, నిలబడి మూత్ర విసర్జన చేయ వచ్చని, ఈ విధాన వలన యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌(మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు) రాకుండా ఉంటాయి. ఇది పోర్టబుల్‌ మరియు డిస్పోసల్‌ కోన్‌ దీన్ని మహిళలు తమ హ్యాండ్‌ బాగ్‌ , హ్యాండ్‌ పర్సు లో వుంచు కో వచ్చు. మగాళ్లలాగే మహిళలు కూడా ఇక నిలబడి పోసుకోవచ్చు. వారి ఆత్మగౌరవం మొదలయ్యేది అక్కడే.” అని ruralmedia  ప్రతినిధితో పిఏపి,నేషనల్‌ సేల్స్‌ మేనేజర్‌ అపూర్వ త్రిపాటి అన్నారు.
మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు 
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ నిర్వహించిన ఇటీవలి అధ్యయనం:
1, పురుషుల కన్నా మహిళలలో యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ ఎక్కువగా వస్తున్నాయి.
2, భారతదేశంలో 10 మందిలో 7 గురు యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు.
3, సుమారుగా 50-60 శాతం మంది స్త్రీలు వారి జీవితకాలంలో కనీసం ఒక సారి యుటిఐ తో బాధపడుతున్నారు.
మన దేశంలో సుమారుగా. 117 మిలియన్‌ స్త్రీలు పబ్లిక్‌ టాయిలెట్‌లను ఉపయోగిస్తున్నారు. అక్కడి బ్మాక్టిరీయా వల్లనే యుటిఐ సమస్యలు ఎదురవుతున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలకు చక్కని పరిష్కారం ఈ కొత్త సాధనం. అన్ని షాపింగ్‌ మాల్స్‌లో ‘పీ కోన్‌’ లు లభ్యమవుతాయని ఉత్పత్తి దారులు తెలిపారు. తెలంగాణ గ్రామీణ మహిళల్లో యుటిఐ సమస్యలు రాకుండా అవగాహన కల్గించే కార్యక్రమాలు నిర్వహించ డానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు ఈ సందర్బంగా అపూర్వ చెప్పారు.
‘పీ కోన్‌’ ల కోసం వీరిని సంప్రదించండి … apurwa@peecone.com/caii-9625940592

Disposable,pee cone

Disposable,pee cone

………………………………………….

Share.

Leave A Reply