పొగ చూరిన బతుకుల్లో భాస్కరుడు

Google+ Pinterest LinkedIn Tumblr +

పొగ చూరిన బతుకుల్లో భాస్కరుడు

మారుమూల పల్లెల్లో వంటింటి ని చూడండి.. గోడలన్నీ పొగచూరి కనిపిస్తాయి. కట్టెల పొగకు కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే, ఇనుప గొట్టాలు పట్టుకొని ఊపిరి ఆగిపోయేలా ఊదితే తప్ప పొయ్యిమీద అన్నం ఉడికి ముద్ద గొంతులో దిగని బతుకులు కనిపిస్తాయి. ఇలా ఈ మట్టిపొయ్యిల కారణంగా ఏటా కనీసం 16లక్షల పల్లెమహిళలు చనిపోతున్నారనేది ఒక సర్వే చెప్పిన వాస్తవం ఇది చదివిన మీరు,నేను అయ్యో పేద తల్లులకు ఎంత కష్టం అని నిట్టూర్చి మరో వార్తలో తల దూరుస్తాం.
కానీ, రంగారెడ్డి జిల్లా.గుండాల గ్రామానికి చెందిన నక్కా సాయిభాస్కర్‌ మన లాగా సానుభూతి చూపించి ఊరుకోలేదు. మట్టిపొయ్యిల మధ్య మగ్గిపోతున్న మహిళలకు విముక్తి కలిగించాలనుకున్నాడు. కేవలం రూ.5 నుండి 10లకే వాళ్లకో పరిష్కారం చూపాడు. ఐఐటీలో ఉన్నత చదువు చదివి పెద్ద ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా పల్లెబాట పట్టాడు. తను తయారు చేసిన పొగారాని పొయ్యిలను ఎడ్లబళ్ల పై వేసుకొని వాగులు వంకలు దాటి మారు పల్లెలకు పోయి గ్రామస్ధులకు అందిస్తున్నాడు. మసిపొయ్యిల నుండి వేలాది మందికి విముక్తి కలిగించి వారి ఆరోగ్యాన్ని కాపాడి ఆయుష్షును కాపాడుతున్నాడు.
హ్యాట్సాఫ్‌ సాయిభాస్కర్‌

Share.

Comments are closed.