ఫోన్ చేస్తే,శానిటైజర్లు,మాస్కులు హోం డెలివరీ

Google+ Pinterest LinkedIn Tumblr +

 కరోనా కష్టకాలం లో , లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్   ప్రజల కోసం  శానిటైజర్లు, మాస్కులను హోం డెలివరీ చేయాలని తెలంగాణ జైళ్లశాఖ నిర్ణ యించింది.

   పూర్తి వివరాల కోసం జైళ్ల సేల్స్ సూపరింటెండెంట్ ని ఫోన్ లో సంప్రదించగా,
 ‘’ చర్లపల్లి జైలు నుంచి సరఫరా  చేసే  ఈ కిట్లో(Home Health and Hygiene Kits) 2 శానిటైజర్లు(320 ml ), 6 మాస్కులు 2 హ్యాండ్ వాష్ బాటిళ్లు, 4 సబ్బులు, 2 ఫినాయిల్ బాటిళ్లు, ఉంటాయ. వీటి ధర రూ. 900/-మాత్రమే.    వీటిని హైదరాబాద్  వాసులకు మాత్రమే అండ చేస్తాము. ఒక కాలనీ నుంచి  కనీసం 15 ఆర్డర్లు వస్తే, హోం డెలివరీ  చేస్తాం .   డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇప్పుడు ఆర్డర్ చేసిన వారికి  వచ్చే వారం అంద చేస్తాము. ఉత్పత్తులు కావాల్సినవారు చర్లపల్లి జైలు DSP వెంకటేశం  ( 9494632101 ) కు ఫోన్/SMS చేసి, ఆర్డర్లు ఇవ్వాలి’’ అని   చర్లపల్లి, జైళ్ల సేల్స్ సూపరింటెండెంట్ దశరథ రామి రెడ్డి Ruralmedia కు తెలిపారు. 

Share.

Leave A Reply