ఈ రైతు ఆదాయం నెలకు 3 లక్షలు !

Google+ Pinterest LinkedIn Tumblr +

ఖానాపూర్(Near Chevella,RR dist) లో వెళ్తుంటే రోడ్ కిరువైపులా ,పాల కూర కొత్తిమిర పంటలు కనువిందు చేస్తుంటాయి. అలా కొంతదూరం నడిస్తే, ఎర్ర గులాబీల పరిమళం మనల్ని ఆపేస్తుంది. నాలుగు ఎకరాల వరకు విస్తరించిన పూల వనంలో ప్రతీపువ్వును పలకరిస్తూ కనిపించాడు రైతు గోవర్ధన్. మూడు రకాల రోజా సువాసనల ను మాకు పరిచయం చేసి, వాటి మార్కెట్ విలువను వివరించాడు. ‘‘ ఇంతకీ ఆదాయం ఎలా ఉంది?’’ అని అడిగాం.

‘‘ 8 నుండి10 వేల వరకు ..’’ అన్నాడు.

‘‘ నె ల కా…?’’

‘‘ కాదండీ… అన్ని ఖర్చులు పోనూ రోజుకు వచ్చేది.’’ అన్నాడు కూల్‌గా.

మేము ఉలిక్కి పడ్డాం. మరో సారి గులాబీ తోట వైపు చూసాం . పూలు కరెన్సీ నోట్లుగా విచ్చు కుంటున్నాయి . అతడు చెప్పింది నమ్మబుల్‌గా లేదా? పూల సాగు లో దాగిన సంపద రహస్యం అతడి మాటల్లోనే… https://youtu.be/SJv4tILEUm4

Share.

Leave A Reply