ఇరవైరూపాయలతో,కరోనాను తరిమేయండి!

Google+ Pinterest LinkedIn Tumblr +

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్‌ ప్రభావం వల్ల చాలా మంది ప్రజలు భయబ్రాంతులకు గురవ్వడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఈ వైరస్‌ ప్రభావానికి గురవుతూనే ఉన్నారు.
ఈ నేపధ్యంలో కరోనా వైరస్‌ నుండి కాపాడుకోవడానికి శానిటైజర్లు, మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో మాస్కుల ధరలు విపరీతంగా పెంచేసి అమ్ముతుండగా, మరో వైపు శానిటైజర్లకు కొరత ఏర్పడింది. చిన్న బాటిళ్లు సైతం రూ.వందల్లో ఉంటున్నాయి. దీని వల్ల సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి.
ఈ పరిస్థితుల్లో ఇంట్లోనే సులువుగా అతి తక్కువ ఖర్చుతో శానిటైజర్‌ తయారు చేసుకునే విధానం కోసం సామాన్యులు ఆసక్తి చూపుతున్నారు.
ఇరవై రూపాయల కే శానిటైజర్‌!!
సామాజిక సేవా కార్యక్రమాకు ముందుండే, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శానిటైజర్‌ తయారు చేసుకునే పద్ధతిని ఇలా వివరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఫార్ములా ప్రకారం రూ.20తోనే 200 మి.లీ.శానిటైజర్‌ తయారు చేసుకోవచ్చంటున్నారు. తమ వైద్య నిపుణుల ద్వారా ప్రతీ ఇంట్లో శానిటైజర్‌ తయారీ విధానం, అందులో వాడాల్సిన ద్రావణాలు , అవి దొరికే దుకాణాల ను విశ్వేశ్వర్‌రెడ్డి వివరిస్తున్నారు. శానిటైజర్‌ తయారీకి వినియోగించే ద్రావణాలు హైదరాబాద్‌, అబిడ్స్‌ తిలక్‌రోడ్‌లోని ల్యాడ్‌ కెమికల్స్‌ అమ్మే దుకాణాల్లో లభిస్తాయని, బేగంబజార్‌లో ప్లాస్టిక్‌ స్ప్రే బాటిళ్లు దొరుకుతాయన్నారు.
200 మిల్లీ లీటర్ల శానిటైజర్‌ తయారీకి అవసరమైనవి
ఐసోప్రొపైల్‌ ఆ్కహాల్‌ – 100 మి.లీ. (Isopropyl Alcohol)
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ – టేబుల్‌ స్పూన్‌ (Hydrogen Peroxide )
స్వచ్ఛమైన నీరు – 90 మి.లీ.
గ్లిజరిన్‌/గ్లిజరాల్‌ – టేబుల్‌ స్పూన్‌ (Glycerine or Glycerol )
ఇలా తయారు చేయాలి…
ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్‌ ఆ్కహాల్‌ను ఒక పాత్రలో తీసుకోవాలి. దీనికి టేబుల్‌ స్పూన్‌ చొప్పున గ్లిజరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపితే, శానిటైజర్‌ తయారు.
ఇంట్లో వాడేసిన ఖాళీ స్ప్రే బాటిల్‌ లేదా ప్లాస్టిక్‌ బాటిల్‌లో పోసి, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగడానికి శానిటైజర్‌గా వాడుకోవచ్చు. అంటున్నారు ఈ మాజీ ఎంపీగారు.
కరోనా వైరస్‌ లక్షణాలివే!
ఈ వ్యాధి సోకిన వారికి ముందుగా జుబు ఉంటుంది. తర్వాత జ్వరం, దగ్గు, తనొప్పి, ఛాతిలో నొప్పి.. వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.
గొంతునొప్పి, చలిజ్వరం వంటి క్షణాు కూడా ఉంటాయి. వీటన్నింటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోవాలి. కాబట్టి ఈ పరిస్థితి రాకముందే ప్రతీ ఒక్కరూ పరిశుభ్రతను పాటించి, జాగ్రత్తలు తీసుకోవాంటున్నారు నిపుణలు . దీని ద్వారా వ్యాధికి సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
కొన్ని జాగ్రత్తలు
1, తెలియని వారిని తాకకూడదు..
2, మనకు తెలియని వారికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి.. తెలియని వారిని ముట్టుకోవడం, తాకడం లాంటివి చేయకూడదు..
3, ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు . వ్యాధి కారకాలు ఒకరి నుంచి మరొకరికి చేరే అవకాశం ఉంది. కాబట్టి తెలియని వారికి అంత సన్నిహితంగా మెలగడం మంచిది కాదు..
4, చాలా మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించడం చాలా మంచిది.
5, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి
6, జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

Share.

Leave A Reply