సజ్జ రొట్టెలో,గడ్డినువ్వుల పొడి రుచి చూస్తారా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

జహీరాబాద్ లో పస్తాపూర్ . లంచ్ సమయం, ఆకలి దంచుట… ఎక్కడా హోటల్ కానరావడం లేదు. ఇంతలో ఈ రొట్టె ల బండి ప్రత్యక్షం అయింది. కూతురు బండిని నడుపుతుంటే, సరళమ్మ జొన్న రొట్టెలు వత్తుతోంది. పక్కనే పెనం మీద కాలిన సజ్జరొట్టెలను మాకు వడ్డించింది . దానిలో గడ్డినువ్వుల పొడి వేసింది. ఆవురావురంటూ తింటున్నాం.

మా ఆకలి కనిపెట్టిన ఆమె ‘ ఈ మసాలా పాల కూర రొట్టెలు కూడా రుచి చూడండి…’ అని వాటిలో నిమ్మకాయ కారం పొడి, జొన్నలడ్డు వడ్డించింది. ఆమె చేతిలో మహత్తు ఏమిటో కానీ అన్ని రొట్టెల్లో అరుదైన రుచి ఉంది. తన పొలం లో తానె సాగు చేసిన మిల్లెట్స్ తో ఇలా రొట్టెలు చేసి అమ్ముతోంది… మరి మీరు కూడా టేస్ట్ చేస్తారా ? https://youtu.be/v_s6d6F99JU

Share.

Leave A Reply